నిన్ను ఎవ్వరూ కాపాడలేరు..మే-23న ప్రమాణస్వీకారానికి రండి

  • Published By: venkaiahnaidu ,Published On : April 25, 2019 / 05:27 AM IST
నిన్ను ఎవ్వరూ కాపాడలేరు..మే-23న ప్రమాణస్వీకారానికి రండి

మే- 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం(ఏప్రిల్-24,2019) ప్రధాని మోడీని ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. లోక్‌ సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా నాలుగు విడుతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 

బుధవారం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గంలోజరిగిన సభలో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ…ఒడిషాలో మరోసారి బీజేడీ ప్రభుత్వం ఏర్పడుతుంది.ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పోలింగ్‌ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఓట్లు మా పార్టీకి లభించాయి.సంక్షోభాల సమయంలో మొహం చూపని ప్రధాని.. ఎన్నికల వేళ రాష్ట్రంలో పర్యటిస్తూ ఒడిశా పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని నవీన్ పట్నాయక్ మండిపడ్డారు.మే-23,2019 తర్వాత బీజేడీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తాను మోడీని ఆహ్వానిస్తున్నానని ఆయన తెలిపారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఒడిషాలోని కెండ్రపరలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ నవీన్ పట్నాయక్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు…మీ చేతిలో ఉన్న అధికారులు కూడా అంటూ నవీన్ పట్నాయక్ కి మోడీ వార్నింగ్ ఇచ్చారు. మోడీ వ్యాఖ్యలకు అంతేస్థాయిలో బుధవారం నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు.ఏప్రిల్-29,2019తో ఒడిషాలో లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి.