Punjab Politics : రాహుల్ తో సిద్ధూ భేటీ

పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం వేళ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు.

Punjab Politics : రాహుల్ తో సిద్ధూ భేటీ

Rahul (5)

Punjab Politics  పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం వేళ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. గురువారం పార్టీ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్ మరియు హరీష్ రావత్ లను కలిసిన సిద్ధూ ఇవాళ రాహుల్ భేటీ అయ్యారు. అయితే, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చాన్నీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో అసంతృప్తి చెందిన సిద్ధూ గత నెలలో పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయగా..సిద్ధూ రాజీనామాను కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు ఆమోదించని విషయం తెలిసిందే.

పంజాబ్‌కు సంబంధించి తన ఆందోళనలన్నీ హైకమాండ్‌కు తెలియజేసినట్టు గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలతో మీటింగ్ తర్వాత సిద్ధూ చెప్పారు. పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ మీద తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని సిద్ధూ అన్నారు. వారిని సుప్రీంగా పరిగణిస్తానని,వారి ఆదేశాలు పాటిస్తానన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్, పంజాబ్ లబ్ది కోసమేనని ఆయన అన్నారు.

ఇక,పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిద్ధూ వ్యవహరించాలని, సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన సూచనలు ఇచ్చింది. అదే సమయంలో, ఈ నిర్ణయం త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని గురువారం సమావేశం తర్వాత పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ హరీష్ రావత్ చెప్పారు.