Navjot Singh Sidhu : సోనియాగాంధీని కలిసిన సిద్ధూ..పంజాబ్ పీసీసీ కన్ఫర్మ్ అయినట్లేనా?

పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.

Navjot Singh Sidhu : సోనియాగాంధీని కలిసిన సిద్ధూ..పంజాబ్ పీసీసీ కన్ఫర్మ్ అయినట్లేనా?

Sidhu (1)

Navjot Singh Sidhu పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిన నేపథ్యంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నాం ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో ఆమెని కలిశారు సిద్ధూ. పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ లో భారీ మార్పులు ఉండబోతున్నాయని..సిద్ధూకి పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సోనియాతో సిద్ధూ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీ,పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ హరీష్ రావత్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

సమావేశం ముగిసిన సోనియాగాంధీ నివాసం బయట మీడియాతో మాట్లాడిన హరీష్ రావత్..పంజాబ్ లో పార్టీ అధ్యక్షుడి నియామకంకి సంబంధించి నా వద్దనున్న రిపోర్ట్ ని అందించేందుకే నేనిక్కడికి వచ్చాను. సోనియాగాంధీ తన నిర్ణయాన్ని తెలియజేసిన వెంటనే నేను ఆ విషయాన్ని మీడియాకి తెలియజేస్తాను అని రావత్ తెలిపారు.

మరోవైపు, సిద్ధూకి పీసీసీ పదవి దక్కకుండా చేసేందుకు సీఎం అమరీందర్ సింగ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధూ నాయక్వంలో వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడలేమని,సిద్ధూకి పీసీసీ పదవి ఇవ్వొద్దంటూ స్వయంగా సీఎం గురువారం సోనియాగాంధీకి ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమరీందర్ సింగ్ సోనియాగాంధీకి ఫోన్ చేసిన మరుసటి రోజే సిద్ధూ కాంగ్రెస్ అధినేత్రిని కలవడం పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.