Punjab Election : మెత్తబడ్డ సిద్ధూ.. రాజీనామా ఉపసంహరణ

పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మొత్తబడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో కొత్త క్యాబినెట్ శాఖల కేటాయింపు అనంతరం అసంతృప్తి వ్యక్తం

Navjot Sidhu:   పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మొత్తబడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో కొత్త క్యాబినెట్ శాఖల కేటాయింపు అనంతరం అసంతృప్తి వ్యక్తం చేస్తూ పంజాబ్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

సిద్ధూ రాజీనామాను మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో సిద్ధూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదని, మళ్లీ పీసీసీ అధ్యక్ష పదని చేపడతానని పేర్కొన్నారు. అయితే కొత్త అడ్వకేట్ జనరల్,డీజీపీ నియామకం తర్వాతే తాను తిరిగి విధుల్లోకి వస్తానని చెప్పారు.

కాగా, సెప్టెంబర్ 28న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సంభోదిస్తూ రాజీనామా లేఖ రాసిన సిద్ధూ… ”రాజీపడితే మనిషి వ్యక్తిత్వం కోల్పోతాడు. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమ ఎజెండా విషయంలోనూ నేను ఎన్నడూ రాజీపడేది లేదు. ఆ దృష్ట్యా పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సేవలు కొనసాగిస్తాను” అని సిద్ధూ పేర్కొన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జులై 18న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు.

ALSO READ Free Ration : ఇక ఉచిత రేషన్ బంద్.. కేంద్రం కీలక ప్రకటన

ట్రెండింగ్ వార్తలు