Navjot Sidhu: 10 నెలల తర్వాత జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదల

సిద్ధూ విడుదలైన నేపథ్యంలో పాటియాలా జైలు వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. సిద్ధూకి అనుకూలంగా నినాదాలు చేశారు.

Navjot Sidhu: 10 నెలల తర్వాత జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదల

Sidhu

Navjot Sidhu: కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ముందు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు డోలు మోగిస్తూ డ్యాన్సులు చేశారు. సిద్ధూ విడుదల నేపథ్యంలో వారు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు.

పంజాబ్ లోని పాటియాలాలో 1998లో కారు పార్కింగ్ విషయంలో సిద్ధూ, తన స్నేహితుడు కలిసి గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డారు. గుర్నామ్ సింగ్ ను గాయపర్చారు. ఆ తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు (1988 road rage case) లోనే సిద్ధూకి సుప్రీంకోర్టు ( Supreme Court ) సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది.

ఈ ఏడాది మే వరకు ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, సత్ప్రవర్తన కారణంగా ఆయన దాదాపు 50 రోజుల ముందుగానే విడుదల అయ్యారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు జైలు వద్ద డ్యాన్సులు వేస్తున్నారు. అందరికీ అభివాదం చేస్తూ సిద్ధూ జైలు బయటకు వచ్చారు.

పలువురు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడకు వచ్చారు. పాటియాలా జైలు వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సిద్ధూ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సిద్ధూ విడుదల తమకు పండుగ అని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు.

Minister Smriti Irani : ‘పశువుల పాకలో జీవించాం’ కుంగుబాటు నుంచి కేంద్రమంత్రిగా.. వ్యక్తిగత వివరాలు వెల్లడించిన స్మృతి ఇరానీ