Navjot Singh Sidhu : రైతుల నిరసనలకు మద్దతుగా..ఇంటిపై నల్లజెండా ఎగురవేసిన సిద్దూ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.

Navjot Singh Sidhu : రైతుల నిరసనలకు మద్దతుగా..ఇంటిపై నల్లజెండా  ఎగురవేసిన సిద్దూ

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా పంజాబ్ మాజీ మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మంగళవారం పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. భార్య,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నవజోత్ కౌర్ సిద్ధూతో కలిసి నల్ల జెండాలు ఎగురవేశారు. అమృత్​సర్​లోని సిద్ధూ నివాసంలో అతని కుమార్తె రబియా నల్లజెండాను ప్రదర్శించింది. గత మూడు దశాబ్దాల నుండి, అప్పులు పెరగడం మరియు ఆదాయం తగ్గడం వల్ల భారత రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మోసగించబడ్డారు. ఇప్పుడు ఈ కొత్త నల్ల చట్టాలు శవపేటికలో చివరి గోరు అని నిరూపించబడ్డాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా నేను తెలపుతున్నాను మరియు నా తండ్రి సోదరులకు సంఘీభావంగా నిలబడుతున్నాఅని ఇంటిపై నల్ల జెండా ఎగురవేసిన అనంతరం సిద్దూ అన్నారు. నిరసనలో భాగంగా నల్ల జెండాను ఎగురవేసి ప్రతి పంజాబీ రైతులకు మద్దతు ఇవ్వాలి అని సిద్ధూ కోరారు.

కాగా,గత ఆరు నెలలుగా సిద్దూ తన దృష్టిని తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్ సర్ నుండి తన జన్మస్థలం పాటియాలాకు మార్చారు. పాటియాలాలోని తన ఇంట్లో రెండు విలేకరుల సమావేశాలు నిర్వహించడం మినహా ఆయన దాదాపు పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నాడు. రెండేండ్ల‌ క్రితం త‌న శాఖను మార్చిన కార‌ణంగా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ.. వీలుదొరికిన‌ప్పుడ‌ల్లా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పై విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు.

సిద్ధు తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలో చేరుతారని స్వయంగా సీఎం అమరీందర్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే సిద్ధు మంత్రి పదవికి దూరంగా ఉంటూనే అమరీందర్ సింగ్‌పై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలదాడిని కొనసాగిస్తున్నారు. భూముల కబ్జా, ఇసుక మరియు మద్యం మాఫియాను అరికట్టడంలో సొంత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సహాయం చేయడంలో ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్నారు.

ఒకరకంగా పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్‌.. ఏది మాట్లాడినా దానికి వ్య‌తిరేకంగా కౌంట‌ర్ ఇస్తున్నారు సిద్దూ. ఈ నెల 26 న రైతులు బ్లాక్ డే జ‌రపాల‌న్న నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాల‌ని, క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ప్ర‌భుత్వంతో స‌హ‌క‌రించాల‌ని అమ‌రీంద‌ర్ సింగ్ కోరుతుండ‌గా.. వ‌ద్దే వ‌ద్దు అదే రోజున మ‌రీ ఉద్ధృతంగా ఆందోళ‌న చేద్దామ‌ని సిద్దూ పిలుపునిచ్చారు.