PSPCL : రూ. 8 లక్షల కరెంటు బిల్లు బాకీ పడిన సిద్ధూ!

ప్రముఖ క్రికెటర్, రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు కరెంటు బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలంట. ఈ విషయాన్ని పంజాబ్ పవర్ కార్పొరేషన్ (PSPCL) తన వెబ్ సైట్ లో వెల్లడించింది. రూ. 8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపు శుక్రవారంతో ముగిసిపోయిందని తెలిపింది. గత సంవత్సరం నుంచి సిద్ధూ 17 లక్షలకు పైగా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉండగా...మార్చి నెలలో 10 లక్షలు చెల్లించారని, ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా కట్టలేదని సంస్థ వెల్లడించింది.

PSPCL : రూ. 8 లక్షల కరెంటు బిల్లు బాకీ పడిన సిద్ధూ!

Navjot Singh Sidhu : ప్రముఖ క్రికెటర్, రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు కరెంటు బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలంట. ఈ విషయాన్ని పంజాబ్ పవర్ కార్పొరేషన్ (PSPCL) తన వెబ్ సైట్ లో వెల్లడించింది. రూ. 8,67,540 బిల్లు చెల్లించాల్సి ఉందని, ఈ చెల్లింపు శుక్రవారంతో ముగిసిపోయిందని తెలిపింది. గత సంవత్సరం నుంచి సిద్ధూ 17 లక్షలకు పైగా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉండగా…మార్చి నెలలో 10 లక్షలు చెల్లించారని, ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా కట్టలేదని సంస్థ వెల్లడించింది. ఈ విషయంలో ఆయన్ను సంప్రదించడానికి ప్రయత్నించగా..అందుబాటులో లేరని సమాచారం.

ఇక సిద్ధూ విషయానికి వస్తే..2019లో సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ లో తన స్థాయిని తగ్గించినందుకు..ఆయన రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి సీఎం అమరేందర్ సింగ్..సిద్ధూకు విబేధాలు పెరిగాయి. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఈయన ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పెద్దలతో ఆయన భేటీలు జరిపారు.