Navneet rana couple: వదిలేదే లేదు.. నవనీత్ రాణా దంపతులకు మరో ఝలక్ ఇచ్చిన శివసేన సర్కార్​..

అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను శివసేన సర్కార్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. శివసేన సర్కార్ కు వీరికి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో అవకాశం ఉన్నచోటల్లా ఎంపీ నవనీత్ రాణా దంపతులను ఇరుకున పట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది...

Navneet rana couple: వదిలేదే లేదు.. నవనీత్ రాణా దంపతులకు మరో ఝలక్ ఇచ్చిన శివసేన సర్కార్​..

Navaneet Rana Couple

Navneet rana couple: అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను శివసేన సర్కార్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. శివసేన సర్కార్ కు వీరికి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో అవకాశం ఉన్నచోటల్లా ఎంపీ నవనీత్ రాణా దంపతులను ఇరుకున పట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా హనుమాన్ చాలీసా పఠన వివాదంలో అరెస్టయి విడుదలైన వీరికి మరో షాక్ తగిలింది. ముంబయిలో ఖేర్ ప్రాంతంలోని ప్లాట్ లో కొంతభాగం అక్రమంగా నిర్మించుకున్నారని, దాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని ముంబయి నగర పాలక సంస్థ శనివారం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా తొలగించకపోతే ఆ పని తామే చేస్తామని హెచ్చరించింది.

Hanuman Chalisa Row : ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌ మంజూరు
అంతేకాక ఇంటి యజమానికి నెలరోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు నవనీత్ రాణా దంపతులను హెచ్చరించారు. తాము అన్ని నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేసుకున్నామని రాణా దంపతులు వెల్లడించినప్పటికీ వారి వాదనలను ముంబయి నగర పాలక సంస్థ అధికారులు కొట్టిపారేశారు. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అధికారుల నుండి అనుమతులు, ఆమోదం పొందిన ప్రణాళికల పత్రాలను సమర్పించడంలో యాజమాని విఫలమయ్యారని ముంబయి నగరపాలక సంస్థ పేర్కొంది. దీంతో దాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించి కూల్చివేతకు ఆదేశించినట్లు నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు.

Hanuman Chalisa Row : నవనీత్‌ కౌర్‌ దంపతులపై శివసేన ఎంపీ సంచలన ఆరోపణలు

గత కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించి తీరుతామంటూ నవనీత్ కౌర్ దంపతులు సవాలు విసిరిన విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ రాణా దంపతులపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరికి బాంద్రాలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా.. పద్నాలుగు రోజులు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఈ నెల 4న వీరు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచి శివసేన సర్కార్, నవనీత్ రాణా దంపతుల మధ్య వివాదం మరింత తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో శివసేన సర్కార్ పెద్దలు నవనీత్ రాణా దంపతుల పై గురిపెట్టారు. ఎక్కడ అవకాశం దొరికినా వారిని ఇబ్బందులు పెట్టేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారంటూ నవనీత్ రాణా దంపతుల మద్దతు దారులు శివసేన సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.