మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల!

మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల!

Rakeshwar Singh Released

Chattisgarh Maoist Attack: ఐదు రోజులపాటు మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలైనట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత.. మావోయిస్టుల చెర నుంచి కోబ్రా రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యారు. అంతకుముందు మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టారు.

జవాన్ విడుదల బాధ్యతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్‌కు అప్పగించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్.. మావోయిస్టుల దాడిపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మావోలు రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేశారు. కాసేపట్లో బెటాలియన్ వద్దకు చేరుకోనున్నారు రాకేశ్వర్ సింగ్. ఏప్రిల్ 3వ తేదీన ఎన్ కౌంటర్ తర్వాత రాకేశ్వర్ సింగ్ మావోలకు చిక్కిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ జరగగా.. ఈ ఘటనలో 24 మంది జవాన్లు అమరులు అవ్వగా.. 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం జవాన్ల నుంచి మావోయిస్టులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ఈ దాడి జరిగింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు జవాన్ తమ చెరలోనే ఉన్నట్లు మావోయిస్టులు చెబుతున్నారు. తెర్రం పీఎస్ పరిధిలో జర్నలిస్ట్‌లు, స్థానికులు మావోయిస్ట్‌లతో చర్చలు జరుపుతున్నారు. వారి సహకారంతో విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరోసారి విడుదల విషయంలో సస్పెన్స్ వాతావరణం కనిపిస్తుంది. కాసేపట్లో బెటాలియన్‌కు వస్తున్నారు అనే మాట వాస్తవమా? కాదా? అనేదాంట్లో అయోమయం నెలకొని ఉంది.