పేరుకు పాన్ షాప్, అందులో అమ్మేది డ్రగ్స్..ప్రముఖులే ట్రార్గెట్

పేరుకు పాన్ షాప్, అందులో అమ్మేది డ్రగ్స్..ప్రముఖులే ట్రార్గెట్

Mumbai’s famous Muchhad Paanwala : ఆకులు చుట్టుకుంటూ..సిగరేట్లు, ఇతర పాన్ పదార్థాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తి కోటీశ్వరడయ్యాడు. ఎంతో మంది కస్టమర్లు ఆ పాన్ షాప్ ముందట వాలిపోతుంటారు. సామాన్యుడి నుంచి మొదలుకుని..సెలబ్రెటీలు సైతం వస్తుండడం ఆ ప్రాంతం కిక్కిరిసినట్లు కనిపిస్తుంటుంది. ఈ షాప్ పై పోలీసులు దృష్టి పెట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మొత్తం మత్తు పదార్థాలు పాన్ షాప్ నుంచి వెళుతున్నాయని గుర్తించారు. ఈయన్ను అరెస్టు చేయడంతో డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైంది. 1970లో దక్షిణ ముంబైలో మొదలైన పాన్ షాప్ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తోందని పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే..

ముచ్చడ్ పాన్ వాలాగా పాన్ వ్యాపారి మనోజ్ తివారీ గుర్తింపు పొందారు. తన ఇద్దరు సోదరులతో పాన్ షాప్ ను ఏర్పాటు చేశాడు. ప్రముఖలతో సత్సంబంధాలు పెంచుకోవడంతో ప్రజలతో కిటకిటలాడేది. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వారితో పాటు వ్యాపార వేత్తలు, ఇతర పారిశ్రామిక వేత్తలు కస్టమర్లు ఉన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారాల్లో పాన్ షాప్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దుకాణంలో జరుగుతున్న వ్యవహారం గుర్తించి..సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి లింక్ లు ఉన్నాయని నిర్ధారించారు. ఈ క్రమంలో…శనివారం పాన్ వ్యాపారి మనోజ్ తివారీని అరెస్టు చేశారు. పాన్ షాప్ నుంచి మత్తు పదార్థాలు వెళుతున్నాయని నార్కోటిక్స్ నియంత్రణ బోర్డు (ఎన్ సీబీ) గుర్తించింది. అతడికి సమన్లు జారీ చేసింది.

తివారీతో పాటు..మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారిలో ఒకరు బ్రిటన్ కు చెందిన కరణ్ సజ్ నాని, రహీలా ఫర్నీచర్ వాలా ఉన్నారని ముంబై అధికారులు వెల్లడించారు. రహీలా గతంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ కు మేనేజర్ గా పని చేసిందని, ఈమె సోదరి సైష్టా గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్టయ్యిందన్నారు. మొత్తం 200 కిలోల వివిధ రకాల మత్తు పదార్థాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారని, విలువైన వాటిని కరణ్ సజానీ తీసుకున్నారన్నారు. అత్యంత సంపన్నులకు డ్రగ్స్ సరఫరా చేస్తుండేదని, వీటిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు నార్కోటిక్స్ ముంబై జోనల్ కమిషనర్ సమీర్ వాంఖడే తెలిపారు. వీరి నుంచి మొత్తం 200 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.