బీహార్ డిసైడ్ చేసేసింది… మళ్లీ NDAదే అధికారం: మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 12:23 PM IST
బీహార్ డిసైడ్ చేసేసింది… మళ్లీ NDAదే అధికారం: మోడీ

NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…దేశానికే కాదు ప్రపంచానికి కూడా బీహార్ మేసేజ్ ఇస్తుంది. కరోనా వేళ ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్దకు వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యపు పవర్ మరియు ప్రతి బీహారీ అంకితభావం. కరోనా నేపథ్యంలో కఠినమైన పరిస్థితుల నడుమ అదనపు జాగ్రత్తలు,ప్రిపరేషన్స్ తో ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ని అభినందిస్తున్నట్లు మోడీ తెలిపారు.



గడిచిన దశాబ్దకాలంలో బీహార్ లోని ప్రతి ఇంటికి కరెంట్,గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఇప్పటినుంచి,2021-2030వరకు బీహార్ ప్రజల మరిన్ని ఆకాంక్షలను నెరవేర్చాల్సిన సమయం అన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై కూడా ప్రదాని విమర్శలు గుప్పించారు. ప్రజలను ఎక్కువ కాలం ఫూల్స్ చెయ్యలేరంటూ విపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితే దీనికి ఉదాహరణ అని..ప్రస్తుతం రాజ్యసభ, లోక్ సభలో కలుపుకొని కూడా కాంగ్రెస్ కు 100మంది ఎంపీలు లేరన్నారు. తమకు అవకాశం దొరికనప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్ ను శిక్షిస్తున్నారన్నారు.



https://10tv.in/nda-crosses-100-mark-in-rajya-sabha-congress-drops-to-lowest-ever-tally/
బీహార్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు అందుతున్న ప్రధమిక సమాచారం ప్రకారం..బీహార్ లో మళ్లీ ఎన్డీయేనే అధికారంలో కూర్చోబెట్టాలని బీహారీలు ఇప్పటికే డిసైడ్ అయినట్లు తెలిసిందన్నారు. ఎన్డీయే కూటమికి ఓటు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేయాలని బీహారీలు నిర్ణయించుకున్నారని మోడీ అన్నారు.



కాగా, కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3దశల్లో ఎన్నికలు జరుగుతుండగా…ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతోంది. రెండో దశలో భాగంగా 17జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. అక్టోబర్-28,2020న తొలి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఇక, మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.