Nela Vemu : నేల వేము సాగు విధానం…మెళుకువలు

ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్‌ వేసుకోవాలి.

Nela Vemu : నేల వేము సాగు విధానం…మెళుకువలు

Neala Vemu

Nela Vemu : కాలేయ వ్యాధులకు, ఉదర రోగాలు మరియు అనేక రకాల జ్వరాల నివారణకు నెలవేమును విరివిగా ఉపయోగిస్తారు. దీనిలో అనేక ఔషదగుణాలు ఉండటంతో ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో రైతులు నేల వేమును వాణిజ్య సరళిలో సాగుచేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మొక్కలోని అన్ని భాగాలలో అంధ్రోగ్రాఫోలైన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది చాలా మొండి మొక్క..అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. ఇసుక గరవ నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి.

అన్ని రకాల వాతావరణల్లో పెరుగుతుంది. చల్లని వాతావరణం, సంవత్సరమంతా వర్షపాతం ఉండే ప్రాంతాలు అత్యంత అనుకూలం. 40-45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. జూన్‌ నెలలో నాటేందుకు అనుకూలం, వర్షాదారంగా సాగుచేయవచ్చు. విత్తనం ద్వారా దీనిని సాగుచేస్తారు. ఎకరాకు 160 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. నారుమడి ద్వారా సాగు చేయాలంటే మే-జూన్‌ మాసాలలో ఎత్రైనమడులలో విత్తాలి. 40-45 రోజుల వయన్సు కలిగి, 8-10 సెం.మీ. ఎత్తు కలిగిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్‌ వేసుకోవాలి. నాటిన 30 రోజుల తర్వాత మరొక దఫా 15 కిలోల నత్రజని ఎరువులు అందించాలి. తొలిదశలో 3-4 రోజులకొకసారి, తరువాత దశలో 10 రోజులకొకసారి నీరివ్వాలి. నాటిన నెల రోజులకొకసారి మరియు 60 రోజులకొకసారి కలువు తీయాలి.

ప్రమాదకరమైన చీడపీడలేమీ ఆశించపు కాబట్టి పురుగుమందుల ఖర్చు తక్కువగానే ఉంటుంది. మొదటి కోత నాబిన 90-120 రోజులకు వస్తుంది. భూమి నుండి 10-15 నెం.మీ. ఎత్తులో మొక్కలను కత్తిరించి వేయాలి. తిరిగి నత్రజని వేసి నీరిస్తే 60 రోజుల్లో రెండవ కోతకు వస్తుంది. మొత్తం మీద సంవత్సరానికి 2-8 కోతలు తీసుకోవచ్చు. కోసిన తరువాత 3-4 రోజులు నీడలో ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. ఎకరాకు 8టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఎకరానికి షుమారు రూ. 10,000/- ఖర్చు అయితే 30,000 వేల వరకు నికర అదాయం లభిస్తుంది.