India-UK flight : ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్నారా..జేబులకు చిల్లులు పడినట్లే

ఢిల్లీ నుంచి మీరు లండన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.... మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్‌ ఫ్లైట్‌ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్‌ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా లండన్, ఇండియాల మధ్య విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.

India-UK flight : ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్నారా..జేబులకు చిల్లులు పడినట్లే

Delhi To London

India-UK Flight : ఢిల్లీ నుంచి మీరు లండన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే…. మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్‌ ఫ్లైట్‌ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్‌ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా లండన్, ఇండియాల మధ్య విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లేందుకు విమాన ఛార్జీలు చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ నుంచి లండన్‌కు వన్‌వే ఛార్జ్‌ 3లక్షల 95వేల రూపాయలు… ఈ రేటు చూసి ప్రయాణికులకు మైండ్‌ బ్లాక్‌ అవుతోంది. గాల్లో విమానాలు ఎగరడం చూశాం కానీ రేట్లు కూడా అంతకు మించి ఎత్తుకు పెరిగిపోవడం మాత్రం ఇదే తొలిసారేమో. టికెట్‌ రేటు ఈ స్థాయిలో ఉండటాన్ని గమనించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజీవ్‌గుప్తా విమానయానశాఖ కార్యదర్శి పీఎస్‌ ఖరోలాకు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు.

Read More : Wedding Photoshoot : వరుడిని కొలనులో తోసేసిన వధువు

ఆగస్టు 26న లండన్‌ వెళ్లేందుకు.. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో టిక్కెట్ కోసం చూడగా.. ఛార్జీ 3లక్షల 95వేల రూపాయలు చూపింది. అందులోనూ అది ఫస్ట్ క్లాస్‌ టిక్కెట్ కాదు.. ఎకానమి క్లాస్‌ మాత్రమే. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌వేస్‌లలో అయితే.. ఆ ఛార్జీ లక్షా 20వేల నుంచి రెండు లక్షల 30వేల రూపాయలుంది. కాలేజీ అడ్మిషన్ల సమయంలో ప్రభుత్వం విమానయాన సంస్థలు ఇలా బాదితే విద్యార్థులు ఇబ్బందులు పడతారని సంజీవ్‌గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన ఫిర్యాదుకు ఏవియేషన్‌ మినిస్ట్రీ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు.

Read More : Azadi Ka Amrut Mahotsav’ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన

భారత్‌లో కేసులు ఎక్కువగా ఉండటంతో మన దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది బ్రిటన్‌… మినహాయింపులతో కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంది. దీనికి తోడు అడ్మిషన్ల సమయం కావడంతో విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో లండన్‌ టికెట్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. రెండు దేశాల మధ్య వారానికి కేవలం 30 విమానాలు మాత్రమే నడుస్తున్నాయి.
విమానాలు తక్కువగా ఉండటంతోనే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని విమానయాన సంస్థలు అంటున్నాయి. త్వరలో మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని అప్పుడే రేట్లు కాస్త తగ్గుతాయని అంటున్నారు. అయితే అప్పటివరకూ విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మాత్రం ఛార్జీల వాత తప్పదు.