Fuel Stations: రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడానికి సిద్ధమైన 800 పెట్రోల్ బంకులు

కొన్ని ఫ్యూయెల్ స్టేషన్లు ముందుగానే స్టాక్ తెప్పించుకుని బ్లాక్ చేసి ఉంచుకుంటుండగా.. ఇంకొన్ని మూసేసేందుకు సిద్ధమవుతున్నారు.

10TV Telugu News

Fuel Stations: పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో వాహనదారుల్లో దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. ధరలు భరించలేక ప్రత్యామ్న్యాయ మార్గాలు వెదుక్కుంటున్నారు. వినియోగం తగ్గిపోతుంటే మరో వైపు పెట్రోల్ బంకులు నిర్వహించే వారిపైనా ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ఫ్యూయెల్ స్టేషన్లు ముందుగానే స్టాక్ తెప్పించుకుని బ్లాక్ చేసి ఉంచుకుంటుండగా.. ఇంకొన్ని మూసేసేందుకు సిద్ధమవుతున్నారు యజమానులు. ఇలాగే ఉంది పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 బంకులు పరిస్థితి.

పంజాబ్ లో నెలకు 90 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలుండగా.. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో హర్యానాలో 155కిలో లీటర్లు, హిమాచల్ ప్రదేశ్ లో 183కిలోలీటర్లుగా ఉన్నాయి.

సగటున ఒక ఫ్యూయెల్ స్టేషన్ లో నెలకు 100కిలోలీటర్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. పంజాబ్ లో మొత్తం 2వేల 492 ఫ్యూయెల్ స్టేషన్లు ఉండగా. ఒక్కొక్కటి 100కిలో లీటర్ కంటే తక్కువే అమ్మకాలు జరుపుతుంది. 721ఫ్యూయెల్ స్టేషన్లలో యావరేజ్ సేల్ కంటే 21శాతం తక్కువే అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే 36కిలోలీటర్ల కంటే తక్కువే.

…………………………………………….. : నా ఫ్రెండ్ బన్నీ అంటే నాకు అసూయ : మంచు విష్ణు

రాష్ట్రంలో వ్యాట్ ధరలు ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు తగ్గాయని ఫ్యూయెల్ స్టేషన్ ఓనర్లు చెబుతున్నారు. పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయిన IndianOil (1,848), Bharat Petroleum (680) and Hindustan Petroleum (932)లలో పెట్రలో పై 35.25శాతం వ్యాట్, డీజిల్ పై 16.82శాతం విధిస్తున్నారు.

పంజాబ్ తో పోల్చుకుంటే.. జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీఘడ్ లో వ్యాట్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ కారణంతోనే బోర్డర్ లో ఉన్న ఫ్యూయెల్ స్టేషన్లలో అమ్మకాలు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిపోతున్నాయి. ఫలితంగా మొహాలీ, రూప్ నగర్, పఠాన్ కోట్, హొషైర్పూర్, పటియాలా, పతేగఢ్ సాహిబ్ లలో భారీ నష్టాలు కనిపిస్తున్నాయి.

×