Nebuliser : ఆక్సిజన్ సిలిండర్‌ లేదని నెబ్యులైజర్‌ వాడుతున్నారా? ఈ వార్త మీ కోసమే.. ఎంత ప్రమాదమో తెలుసా?

కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సిలెండర్‌ లేనప్పుడు నెబ్యులైజర్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అని నమ్మి చాలామంది గుడ్డిగా నెబ్యులైజర్ వాడేస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాణాలకే ప్రాదం అని హెచ్చరిస్తున్నారు.

Nebuliser : ఆక్సిజన్ సిలిండర్‌ లేదని నెబ్యులైజర్‌ వాడుతున్నారా? ఈ వార్త మీ కోసమే.. ఎంత ప్రమాదమో తెలుసా?

Nebuliser

Nebuliser Not Substitue For Oxygen : కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సిలెండర్‌ లేనప్పుడు నెబ్యులైజర్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అని నమ్మి చాలామంది గుడ్డిగా నెబ్యులైజర్ వాడేస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాణాలకే ప్రాదం అని హెచ్చరిస్తున్నారు.

ఆక్సిజన్‌ సిలిండర్‌ లేనప్పుడు నెబ్యులైజర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతూ ఫరీదాబాద్ కి చెందిన డా. అలోక్‌ సేథి అనే మెడికల్‌ ప్రాక్టీషనర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని చాలామంది భావించి విపరీతంగా షేర్‌ చేసేశారు. అయితే నెబ్యులైజర్‌ వాడటం మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇది ప్రత్యేక ద్రవం నుంచి ఆల్ట్రాసోనిక్‌ వైబ్రేషన్‌ ద్వారా ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్తమా బాధితులకు ఊపిరి సరిగా ఆడనప్పుడు ఈ పరికరాన్ని ఉపయోగించి, వాయునాళంలో అవాంతరాలు తొలగించి ఊపిరాడేలా చేస్తారు. అంతేగాని దీనివల్ల ప్రత్యేకంగా ఆక్సిజన్‌ ఏమీ ఉత్పత్తి కాదని, తెలిసీ తెలియక దీనిని ఉపయోగిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుందని అంటున్నారు.

తాజా వీడియో వైరల్‌ అవ్వడంతో అలోక్‌ సేథి వివరణ ఇచ్చారు. తాను ఆక్సిజన్‌ సిలిండర్‌కు బదులుగా నెబులైజర్‌ను వాడుకోవచ్చు అని చెప్పలేదని, నెబ్యులైజర్‌ ఎలా ఉపయోగించాలో చెబుతూ వీడియో తీసి ఓ వ్యక్తికి పంపానని, అలా అది వైరల్‌ అయ్యిందని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు వైరల్‌ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అంటూ ఎవరెవరో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇది నిజమో కాదో, సేఫో కాదో తెలుసుకోకుండానే చాలామంది వాటిని గుడ్డి షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఫాలో కూడా అవుతున్నారు. ఆ తర్వాత చిక్కుల్లో పడుతున్నారు. ప్రాణల మీదికి తెచ్చుకుంటున్నారు. అందుకే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సొంత ప్రయోగాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.