Neeraj Chopra : నీరజ్‌ చోప్రాకు తీవ్ర జ్వరం, గొంతు మంట.. కరోనా టెస్ట్ చేయగా

టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం గెలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(23) అనారోగ్యానికి గురయ్యాడు. హర్యానాకు చెందిన నీరజ

Neeraj Chopra : నీరజ్‌ చోప్రాకు తీవ్ర జ్వరం, గొంతు మంట.. కరోనా టెస్ట్ చేయగా

Neeraj Chopra

Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం గెలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(23) అనారోగ్యానికి గురయ్యాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, గొంతు మంటతో బాధపడుతున్నాడు. డాక్టర్ల సలహా మేరకు కరోనా టెస్టు చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. శుక్రవారం హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన సభకు కూడా ఈ పసిడి వీరుడు హాజరు కాలేదు.

చోప్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడని అతడి సన్నిహితుడు మీడియాకు తెలిపాడు. నిన్న చోప్రాకు 103 డిగ్రీల తీవ్రతతో జ్వరం వచ్చిందని, ఇవాళ అతడి పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని వివరించాడు. భారత్ వచ్చినప్పటినుంచి ఊపిరి సలపనంతగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, ఈ కారణంగానే అనారోగ్యానికి గురైనట్టు భావిస్తున్నామన్నాడు. డాక్టర్ల సలహాతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని వెల్లడించాడు.

భారత్‌ అథ్లెట్ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం సాధించాడు. ఫైనల్లో నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వందేళ్ల పతక నిరీక్షణకి తెరదించిన నీరజ్ చోప్రా.. రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు.