Neeraj Chopra : కోహ్లితో సమానం..! వెయ్యి రెట్లు పెరిగిన నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన 23ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషన్ హీరో అయిపోయాడు. నీరజ్ చోప్రా ఇప్పుడో సెలెబ్రిటీ. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకు

Neeraj Chopra : కోహ్లితో సమానం..! వెయ్యి రెట్లు పెరిగిన నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ

Neeraj Chopra

Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచిన 23ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషన్ హీరో అయిపోయాడు. నీరజ్ చోప్రా ఇప్పుడో సెలెబ్రిటీ. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలవడం నీరజ్ జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. అంతేకాదు.. నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఏకంగా 1000 రెట్లు పెరిగింది. నీరజ్ చోప్రాను ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చి చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నీరజ్ చోప్రా తో బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేయించుకునేందుకు అతని ఇంటికి కార్పొరేట్ కంపెనీలు బారులు తీరాయి.

నీరజ్ రాబోయే కొద్ది వారాల్లో లగ్జరీ ఆటో, దుస్తుల బ్రాండ్ తో ఐదు-ఆరు ఒప్పందాలపై సంతకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. నీరజ్ చోప్రా ఇప్పటికే బైజూస్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, గిల్లెట్, ఎక్సాన్ మొబైల్, స్పోర్ట్స్ డ్రింక్ గటోరేడ్(Gatorade), కండరాల బ్లేజ్ బ్రాండ్ అంబాసిడర్ తో పాటు అగ్రశ్రేణి ఔషధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు.

Yogesh Parmar: టీమిండియా ఫిజియోకు కరోనా… ఫైనల్ టెస్టు డౌటే..!

నీరజ్ చోప్రా బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఫీజు ఏడాదికి దాదాపు రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, విరాట్ కోహ్లి ఏడాదికి ఒకటి నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తాడు.

ఒలింపిక్స్ ముందు నీరజ్ చోప్రా ఏడాదికి ఎండార్స్ మెంట్ ఫీజుగా రూ.15 నుంచి 25లక్షలు తీసుకునేవాడు. ఇప్పుడు సీన్ మారిపోయింది. అంతకు పది రెట్ల ఎక్కువ డబ్బుతో డీల్స్ కుదుర్చుకుంటున్నాడు.

MS Dhoni: ధోనీ మెంటార్‌గా అందుకే అవసరం

మన దేశంలో క్రీడాకారుల విషయానికి వస్తే అత్యధిక ఎండార్స్ మెంట్ ఫీజు(ఏడాదికి) అందుకుంటున్న వ్యక్తుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. ఏడాదికి కోటి నుంచి 5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నీరజ్ చోప్రా కూడా అదే రేంజ్ కి వచ్చాడు. అయితే కోహ్లి కన్నా తక్కువే అని చెప్పాలి. కాగా, ఇప్పుడు పెరిగిన ఎండార్స్ మెంట్ ఫీజుతో నీరజ్ చోప్రా.. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తో సమానంగా నిలిచాడు. ఆ ఇద్దరు ఏడాదికి రూ.50లక్షల నుంచి కోటి రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు.

కాగా, సుమారు 80 బ్రాండ్ల నుంచి నీరజ్ చోప్రాకు రిక్వెస్టులు వచ్చాయి. అయితే ట్రైనింగ్ క్యాంప్స్ తో నీరజ్ చాలా బిజీ కాబోతున్నాడు. దీంతో కేవలం కొన్ని బ్రాండ్లను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. కాగా, ఆల్కహాల్, పొగాకు బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోకూడదని నీరజ్ నిర్ణయించాడు.

నీరజ్ చోప్రాకు ఇన్ స్టాగ్రామ్ లో 40లక్షల మంది, ట్విట్టర్ లో 6లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒలింపిక్స్ లో మెడల్ గెలిచాక ఒక్కరోజులోనే ఇన్ స్టా లో నీరజ్ కు 10లక్షల మందికిపైగా ఫాలోవర్లు వచ్చారు.