Petrol Free Name Of Neeraj : నీరజ్ పేరుంటే..పెట్రోల్, చికెన్, రోప్ వే జర్నీ ఫ్రీ..ఫ్రీ..!!

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని కౌవసం చేసుకున్న మీరజ్ చోప్రా పేరు దేశమంతా మారు మ్రోగిపోతోంది. ఈ క్రమంలో నీరజ్ అనే పేరు గలవారికి పెట్రోల్ ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఓ పెట్రోల్‌ బంక్‌ యజమాని.

Petrol Free Name Of Neeraj :  నీరజ్ పేరుంటే..పెట్రోల్, చికెన్, రోప్ వే జర్నీ ఫ్రీ..ఫ్రీ..!!

Neeraj Chopra

Petrol Free On The Name Of Neeraj : నీరజ్‌ చోప్రా. భారత్ అంతా మారుమ్రోగిపోతున్న పేరు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన నవ యువకుడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ లో ఏదోక పతకం సాధిస్తేనే కాసులు వర్షం కురిపిస్తున్న క్రమంలో భారత్ కు తొలి బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు బహుమతులు వెల్లువ కురుస్తోంది.

భారత్ హీరో అయిపోయిన మీరజ్ చోప్రా పేరు చెబితేనే దేశం యావత్తు ఉద్వేగానికి గురవుతోంది. ఈక్రమంలో ఇప్పుడు మీరజ్ చోప్రా పేరు ఉన్నవారికి పెట్రోల్ ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఓ పెట్రోల్‌ బంక్‌ యజమాని. నీరజ్‌ చోప్రాపై ఉండే గౌరవంతో ఉచితంగా పెట్రోల్‌ ఇస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..‘నీరజ్‌ చోప్రా’ స్వర్ణ పతకం సాధించడంతో గుజరాత్‌లోని బరూచ్‌లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ యజమాని ఆయూబ్‌ పఠాన్‌ ఆనందంలో మునిగిపోయాడు.

దీంతో నీరజ్‌ చోప్రా పేరు ఉన్నవారికి రూ.501 విలువైన పెట్రోల్‌ ఉచితంగా పోస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారటంతో ఆ పేరు ఉన్న వ్యక్తులు వచ్చి తమ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఇచ్చి పెట్రోల్‌ వేసుకువెళ్లవచ్చని తెలిపాడు. దీంతో ఆ రాష్ట్రంలో నీరజ్‌ పేరు ఉన్నవారందరూ పెట్రోల్‌ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే ఇది రెండు రోజులు మాత్రమేనని ఆయూబ్‌ స్పష్టంచేశారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా నీరజ్‌చోప్రాకు గౌరవంగా పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నామని తెలిపారు.

నిజమైన నీరజ్‌ పేరు ఉన్నవారికే పెట్రోల్‌ ఇస్తున్నట్లు ఆయూబ్‌ పఠాన్‌ స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలో సోమవారం నీరజ్‌ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. కాగా పెట్రోల్ ఆఫర్ కూడా సోమవారంతో ముగిసింది. కాగా..తన ప్రకటతో నీరజ్ పేరుగల 30 మందికి పెట్రోల్ ఉచితంగా ఇచ్చామనితెలిపారు ఆయూబ్‌ పఠాన్‌.

అంతేకాదండోయ్..నీరజ్ చోప్రా పేరు చెబితే ఇంకా ఎన్ని ఫ్రీ అంటే..గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ రోప్‌వే కంపెనీ ఆగస్టు 20 వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. నీరజ్ అనే పేరు ఉంటే వారికి ఉచితం అని సదరు కంపెనీ ప్రకటించింది.

అంతేనా..ఒలంపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా పై ఎంతోమంది తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఏపీలోని తిరుపతిలోని చిల్లీస్ హోటల్ యాజమాన్యం నీరజ్ అనే పేరున్న వారికి 10, 11, 12 మూడు రోజుల పాటు తిరుపతి, కడప నగరాల్లోని తమ హోటల్ లో ఉచితంగా చికెన్ మినీ ప్యాక్ ఇస్తామని ప్రకటించారు చిల్లీస్ హోటల్ యజమాని.