Neet Exam : ఫుల్ స్లీవ్స్ వేసుకోవద్దు, చెప్పులు, శ్యాండిళ్లు వేసుకోవాలి

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 07:27 AM IST
Neet Exam : ఫుల్ స్లీవ్స్ వేసుకోవద్దు, చెప్పులు, శ్యాండిళ్లు వేసుకోవాలి

వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF) పలు నిబంధనలు విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.



సంప్రదాయ దుస్తులు ధరించే వారు (బురఖా) ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వెల్లడించింది. నిబంధనల ప్రకారం..తనిఖీలు చేసి పరీక్ష హాల్లోకి పంపించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. తేలికపాటిగా, హాఫ్ స్లీవ్స్ దుస్తులు ధరించాల్సి ఉంటుందని, పెద్ద బటన్లు, ఫుల్ స్లీవ్స్ దుస్తులకు అనుమతి లేదని స్పష్టంగా చెప్పారు.
https://10tv.in/neet-jee-main-2020-exam/
ఇక బూట్లు వేసుకొని రావొద్దని, చెప్పులు, శ్యాండిళ్లు మాత్రమే వేసుకోవాలని వెల్లడించింది. అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకరావాల్సి ఉంటుందని తెలిపారు.




విద్యార్థులకు సూచనలు.

2019లో ఏపీ నుంచి 57,755 మంది దరఖాస్తు చేశారు. ఇప్పుడా సంఖ్య 61,892కు పెరిగింది.
ఈ ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో 2,28,914 మంది పరీక్ష రాస్తుండగా, అత్యల్పంగా మిజోరాంలో 1,741 మంది రాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కృష్ణా, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 151 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.



మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ పరీక్ష జరుగుతుంది.
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, బ్యాగులు సహా ఇతరత్రా వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు.
పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాలాజలాన్ని వాడరాదు.
అన్ని కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే విద్యార్థులు, సిబ్బందిని అనుమతిస్తారు.



పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవాలి.
ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశాల్ని కల్పిస్తారు.