NEET PG 2021 : నీట్ పీజీ ఎగ్జామ్ తేదీ ఖరారు

రోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రకటిస్తోంది.

NEET PG 2021 : నీట్ పీజీ ఎగ్జామ్ తేదీ ఖరారు

Neet (1)

NEET PG 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రకటిస్తోంది. మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్‌(పీజీ)2021 ఎగ్జామ్ ని సెప్టెంబ‌ర్ 11న నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ ట్విట్టర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్ష హాజరు కాబోయే విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆపై చదువులైన ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకునేవారు నీట్ పీజీ పరీక్షల్లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.

వాస్త‌వానికి గ‌త‌ ఏప్రిల్ 18న నీట్ (పీజీ) ప‌రీక్ష జ‌రుగాల్సి ఉంది. అయితే, అప్ప‌టికే దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విస్త‌రిస్తుండ‌టంతో కేంద్రం నీట్ (పీజీ) ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరోవైపు(యూజీ) 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహిస్తామని సోమవారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే నీట్(యూజీ) 2021 పరీక్ష కోసం విద్యార్ధులు మంగళవారం(జులై-13,2021)నుంచి ఆగస్తు 6వ తేదీ వరకు NTA వెబ్‌సైట్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.