NEFT Services : 14 గంటలు నిలిచిపోనున్న NEFT సేవలు

NEFT సర్వీసులు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు NEFT ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు NEFT సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది.

NEFT Services : 14 గంటలు నిలిచిపోనున్న NEFT సేవలు

Neft Service Won't Be Available For 14 Hours On May 23 Rbi

NEFT Services for 14 hours on May 23 : NEFT సర్వీసులు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు NEFT ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు NEFT సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది.

సాంకేతిక కారణాల రీత్యా NEFT సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. టెక్నికల్ అప్ గ్రేడ్ కోసం మే 22న బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ చేయనున్నట్టు తెలిపింది. మే 23న 00.01 గంటల నుంచి(మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు NEFT సేవలు అందుబాటులో ఉండవు.

మరోవైపు RTGS సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. NEFT సేవలకు సంబంధించి ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు సమాచారం అందిస్తాయని తెలిపింది. ఏప్రిల్‌ 18న RTGS సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్‌ బ్యాంక్ టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. 2019 డిసెంబరు నుంచి NEFT సేవలను 24×7 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి.