ఉద్ధవ్ సీఎం.. రేపే తుది నిర్ణయం : మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్

  • Published By: sreehari ,Published On : November 21, 2019 / 12:18 PM IST
ఉద్ధవ్ సీఎం.. రేపే తుది నిర్ణయం : మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు కలిసి విస్తృత స్థాయిలో చర్చలు జరిపాయి. ఆది నుంచి శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా పవార్ చర్చలు జరిపారు. 

అనంతరం సోనియా శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయాన్ని ప్రకటించారు. మరోసారి కాంగ్రెస్ నేతలతో చర్చల అనంతరం తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం (నవంబర్ 21, 2019) కాంగ్రెస్ నేతలతో మళ్లీ చర్చలు కొనసాగాయి. 

కాంగ్రెస్, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం కావాలని కోరుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో శుక్రవారం భేటీ అనంతరం కాంగ్రెస్ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. 

ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఈ రోజు ఎన్సీపీ నేతలతో కాంగ్రెస్ నేతలంతా సమావేశమైయ్యారు. శివసేనతో కూటమి ఏర్పాటుకు విధివిధానాలపై విస్త్రృత స్థాయిలో చర్చించారు. ఈ చర్చల అనంతరం మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇచ్చే విషయంలో శుక్రవారం కాంగ్రెస్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీతో జరిగిన చర్చలు పూర్తియినట్టు చెప్పారు. ‘అన్ని సమస్యలపై ఏకాభిప్రాయానికి వచ్చేసినట్టే’ అని ఆయన అన్నారు. శివసేనతో శుక్రవారం మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు చౌహాన్ స్పష్టం చేశారు. 

‘ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కూటమి నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించాకే పవర్ షేరింగ్ ఫార్మూలాను వెల్లడిస్తాం. ముంబైలో శుక్రవారం.. ఇతర కూటమి పార్టీలతో కూడా భేటీ కానున్నాం. అదే రోజు శివసేన కూడా చర్చిస్తాం’ అని చౌహాన్ చెప్పారు.

ఈ మీడియా సమావేశంలో చౌహాన్ పక్కనే ఎన్సీప ప్రధాన ప్రతినిధి నవాబ్ మాలిక్ కూడా వెంట ఉన్నారు. ఇదివరకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (cwc) ఎన్సీపీ, శివసేనతో కలిసి సంయుక్తంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సూతప్రాయంగా ఆమోదం తెలిపింది.