నెహ్రూ హిమాలయాలకన్నా పెద్ద తప్పు చేశాడు..చరిత్రను సరిదిద్దే సమయం వచ్చింది

నెహ్రూ హిమాలయాలకన్నా పెద్ద తప్పు చేశాడు..చరిత్రను సరిదిద్దే సమయం వచ్చింది

దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిమాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1947లో నెహ్రూ ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ”ఏవోకే ఏర్పాటుకు కారణమైందన్నారు. 1948లో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లాలని ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయం హిమాలయ తప్పిదం అన్నారు.  హియాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని అన్నారు. అది హిమాలయ కన్నా పెద్ద తప్పు అన్నారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో షా మాట్లాడుతూ..ఐరాసకు కశ్మీర్ విషయాన్ని సూచించడానికి తప్పు చార్టర్‌ను ఎంచుకోవడం ద్వారా నెహ్రూ మరొక తప్పు చేశాడని షా అన్నారు.

ఇవాళ్టికి కూడా ఆర్టికల్ 370 మరియు కాశ్మీర్ గురించి ఈ రోజు చాలా పుకార్లు ఉన్నాయని.. వాటిని స్పష్టం చేయడం ముఖ్యంమని షా అన్నరు. 1947 నుండి కాశ్మీర్.. చర్చ,వివాదానికి సంబంధించిన విషయం అని మనకు తెలుసునని, కాని వక్రీకరించిన చరిత్ర ప్రజల ముందు ప్రదర్శించబడిందన్నారు. చరిత్ర రాసే బాధ్యత తప్పులు చేసిన అదే వ్యక్తుల చేతుల్లో ఉన్నందున ఫలితంగా నిజమైన వాస్తవాలు దాచబడ్డాయని అన్నారు.

తప్పుగా రాసిన చరిత్రను సరిదిద్ది ప్రజల ముందు సమర్పించే సమయం వచ్చిందని తను అనుకుంటున్నానని అమిత్ షా తెలిపారు. కశ్మీర్‌లో సూఫీ సాధువుల సంస్కృతి నాశనమైందని, అప్పుడు ఆర్టికల్ 370రద్దుని వ్యతిరేకిస్తున్న ఈ మానవ హక్కుల ఛాంపియన్లు ఎక్కడ ఉన్నారని షా ప్రశ్నించారు. కాశ్మీరీ పండిట్లను సొంత రాష్ట్రం నుండి తరిమివేసినప్పుడు వారు ఎక్కడ ఉన్నారని షా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 కారణంగా కాశ్మీర్ బాధపడిందన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూశామని, ఆ తరువాత 40,000 గ్రామ పెద్దలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. వచ్చే 4-5 రోజుల్లో తహసీల్ & జిలా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయిని, మూడు అంచెల పంచాయతీ వ్యవస్థ కశ్మీర్ లో పూర్తిగా పనిచేయనుంది అమిత్ షా తెలిపారు.