Nepal Dispute: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నేపాల్: కలాపాని, లిపులేఖ్‌లు తమ భూభాగమే అంటూ కొత్త ప్రధాని వాదన

భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన లింపియాధుర మరియు లిపులేఖ్ మరియు కాలాపాని ప్రాంతాలు నేపాల్ లో అంతర్భాగమంటూ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Nepal Dispute: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నేపాల్: కలాపాని, లిపులేఖ్‌లు తమ భూభాగమే అంటూ కొత్త ప్రధాని వాదన

Nepla

Nepal Dispute: సరిహద్దు వివాదంపై నేపాల్ దేశం మళ్లీ మళ్లీ అదే రాగం ఎత్తుకుంటుంది. ప్రభుత్వం మారిన, పీఠాలు కదిలినా..భారత్ – నేపాల్ సరిహద్దు విషయంలో తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్న చందంగా నేపాల్ వ్యాఖ్యలు ఉంటున్నాయి. భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన లింపియాధుర మరియు లిపులేఖ్ మరియు కాలాపాని ప్రాంతాలు నేపాల్ లో అంతర్భాగమంటూ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేపాల్ ప్రభుత్వం తన భూభాగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. లింపియాధుర మరియు లిపులేఖ్ మరియు కాలాపాని ప్రాంతాలు నేపాల్ వే మరియు ప్రభుత్వానికి వాటిపై గట్టి అవగాహన ఉంది. చాలా సున్నితమైన సరిహద్దు సమస్యను దౌత్య మార్గాల ద్వారా మరియు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించవచ్చని మేము అర్థం చేసుకున్నాము’ అని నేపాల్ పీఎం దేవుబా పార్లమెంటు సమావేశాల సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలతో అలీన విదేశాంగ విధానాన్ని అవలంబించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోనున్నట్లు దేవుబా చెప్పుకొచ్చారు.

other stories: Trading Partner: భారత్‌తో వ్యాపారం.. చైనాను దాటిన అమెరికా

కాగా, భారత్ – నేపాల్ మధ్య సంబంధాలు మరింత పంపొందించే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నేపాల్ లో పర్యటించారు. ఈసందర్భంగా నేపాల్ లో 695 మెగా వాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం నేపాల్ తో పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ప్రస్తుతం నేపాల్ పేర్కొన్న మూడు ప్రాంతాలు భారతదేశం ఆక్రమించినట్లుగా చూపిన భౌగోళిక పటంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా..అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తతకు గురయ్యాయి. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని లిపులేఖ్ మీదుగా కైలాష్ మానసరోవర్‌కు రోడ్డు లింక్‌ను భారత్ ప్రారంభించడంపై నేపాలీ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానిగా ఓలీ దిగిపోగా.. అనంతరం అధికారంలోకి వచ్చిన దేవుబా భారత్ తో సఖ్యత కోరుకున్నారు. ఈక్రమంలోనే సరిహద్దు వివాదం ఓ కొలిక్కి వస్తుందని భావించినా..కొత్త ప్రధాని సైతం పాత పాటే పాడడం మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా ఉంది.