Subhash Chandra Bose Daughter Anita Bose : ‘నేతాజీ అస్థికలు భారత్‌కు తెప్పించండి..డీఎన్‌ఏ పరీక్ష చేస్తే ఆయన మృతిపై అనుమానాలు పటాపంచలు’ : అనితా బోస్‌

నేతాసీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ అన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ మృతిపై కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానం ఇస్తుందన్నారు. 1945 ఆగస్ట్ 18న సుభాష్‌ చంద్రబోస్‌ మరణించగా... ఇప్పటికీ ఆయన మృతిపై కొందరికి అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ అనుమానాలను కేవలం డీఎన్‌ఏ పరీక్ష మాత్రమే పటాపంచలు చేస్తుందన్నారు.

Subhash Chandra Bose Daughter Anita Bose : ‘నేతాజీ అస్థికలు భారత్‌కు తెప్పించండి..డీఎన్‌ఏ పరీక్ష చేస్తే ఆయన మృతిపై అనుమానాలు పటాపంచలు’ : అనితా బోస్‌

Subhash Chandra Bose daughter Anita Bose

Subhash Chandra Bose’s Daughter Anita Bose : నేతాసీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ అన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ మృతిపై కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానం ఇస్తుందన్నారు. 1945 ఆగస్ట్ 18న సుభాష్‌ చంద్రబోస్‌ మరణించగా… ఇప్పటికీ ఆయన మృతిపై కొందరికి అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ అనుమానాలను కేవలం డీఎన్‌ఏ పరీక్ష మాత్రమే పటాపంచలు చేస్తుందన్నారు. ప్రస్తుతం జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు… డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకూ జపాన్‌ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని అనితా బోస్‌ గుర్తుచేశారు.

సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. అధునాతన సాంకేతికతతో వాటిని విశ్లేషించవచ్చని అనితా బోస్‌ అన్నారు. నేతాజీకి భారత స్వాతంత్ర్యం కంటే ఏమీ ఎక్కువ కాదన్నారు. స్వాతంత్య్ర ఫలాలను భారత్‌ అనుభవిస్తోన్న వేళ వాటిని చూసేందుకు నేతాజీ బతికిలేరన్నారు. ఇలాంటి సమయంలోనైనా కనీసం ఆయన అస్థికలను భారత గడ్డకు తీసుకుచ్చేందుకు కృషి చేద్దామని.. అందుకు ఇదే సరైన సమయమని అనితా బోస్‌ పిలుపునిచ్చారు.

Subhash Chandra Bose Hologram: పీఎం మోదీ చేతుల మీదుగా నేతాజీ హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. 1945 ఆగస్ట్ 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు.. ఆయన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పగా, జస్టిస్‌ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్‌ మాత్రం వాటితో విబేధించింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని తెలిపింది. దీంతో రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా? కావా? అన్న విషయం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.