Netflix: నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం, 150మంది ఉద్యోగులపై వేటు

నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న రీసెంట్ డెసిషన్ 150మందిని ఉద్యోగాల్లో నుంచి తీసిపారేసింది. రెవెన్యూ బాగా తగ్గడంతో, కాస్ట్ కటింగ్ కోసమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్సనల్ పర్‌ఫార్మెన్స్ ను బట్టి ఇలా చేయలేదని ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని విధుల్లో నుంచి తొలగించామని..

Netflix: నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న రీసెంట్ డెసిషన్ 150మందిని ఉద్యోగాల్లో నుంచి తీసిపారేసింది. రెవెన్యూ బాగా తగ్గడంతో, కాస్ట్ కటింగ్ కోసమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్సనల్ పర్‌ఫార్మెన్స్ ను బట్టి ఇలా చేయలేదని ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని విధుల్లో నుంచి తొలగించామని నెట్‌ఫ్లిక్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

అటువంటి గొప్ప సహోద్యుగులను ఇంటికి పంపించడం ఏ మాత్రం ఇష్టం లేదని అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ 2లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దశాబ్ద కాలంలో ఇదే పెద్ద దెబ్బని కంపెనీ వెల్లడించింది. ఇక కోల్పోయే సంఖ్య మరో మూడు నెలల్లో 20లక్షల వరకూ చేరుకోవచ్చని ఆందోళన చెందుతున్నారు.

గత నెలలోనూ తమ ఎంటర్‌టైన్మెంట్ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను, రైటర్స్ ను తొలగించింది. నిజానికి నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సైట్ ను గతేడాది మాత్రమే లాంచ్ చేసింది. తమకు రెవెన్యూ రావడం లేదనే కారణంతో మొత్తం టీమ్ నే తొలగించింది నెట్‌ఫ్లిక్స్. పనిపై ఒత్తిడి తీసుకొచ్చిన నెట్‌ఫ్లిక్స్ పని నచ్చకపోతే స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోవచ్చని తెగేసి చెప్పింది.

Read Also: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్

 

ట్రెండింగ్ వార్తలు