Adar Poonawalla: ఇండియాను కాదని వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపలేదు: ఆదార్ పూనావాల్లా

సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆదార్ పూనావాలా ఇండియా వ్యాక్సిన్ ఎగుమతిపై స్పందించారు. కొవీషీల్డ్ తయారుచేస్తున్న తమ సంస్థ.. ఇండియాను కాదని వ్యాక్సిన్లు..

Adar Poonawalla: ఇండియాను కాదని వ్యాక్సిన్‌ను విదేశాలకు పంపలేదు: ఆదార్ పూనావాల్లా

adar-punvala

Adar Poonawalla: సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆదార్ పూనావాలా ఇండియా వ్యాక్సిన్ ఎగుమతిపై స్పందించారు. కొవీషీల్డ్ తయారుచేస్తున్న తమ సంస్థ.. ఇండియాను కాదని వ్యాక్సిన్లు ఎప్పుడూ ఎగుమతి చేయలేదని చెప్పింది. ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండు మూడు నెలలో పూర్తయ్యేది కాదని ఇంత జనాభాకు చాలా సమయం పట్టొచ్చని అన్నారు.

ఓ స్టేట్మెంట్ లో వ్యాక్సిన్ గురించి పేర్కొన్న ఆయన.. వ్యాక్సిన్లను విదేశాలకు పంపేందుకు కమిట్మెంట్ తీసుకున్నారని వచ్చిన కామెంట్లపై స్పందించారు. అదంతా గతేడాది మహమ్మారి ఆరంభ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసినవేనని స్పష్టం చేశారు.

జనవరిలో వ్యాక్సిన్లు లాంచ్ అయినప్పటికే ఇండియాలో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయగలిగాం. అదే సమయంలో ఇతర దేశాలు సంక్షోభంలో ఇరుక్కుపోయి సాయం కోసం ఎదురుచూశాయి. అప్పుడే వీలైనంత సాయం చేశామని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహమ్మారి ప్రభావం గురించి మాట్లాడుతూ.. రాజకీయ హద్దులు దాటి, భౌగోళికంగా దీనిని ఎదుర్కోకపోతే ప్రతి ఒక్కరూ సేఫ్ అయినట్లు కాదని అన్నారు.