Test Captain : బీసీసీఐకి కొత్త సవాల్‌.. కోహ్లీ స్థానంలో ఎవరు..?

రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్ల కమాండ్‌ని తీసుకున్నాడు. టెస్టు జట్టుకు కూడా రోహితే కెప్టెన్ అవుతాడా? లేకపోతే రాహుల్‌కు ఛాన్స్‌ ఇస్తారా..? అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Test Captain : బీసీసీఐకి కొత్త సవాల్‌.. కోహ్లీ స్థానంలో ఎవరు..?

Bcci (1)

New challenge for BCCI : భారత క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. ఏడేళ్లుగా జట్టును ముందుకు నడిపించి విదేశాల్లోనూ గెలుపు రుచిని చూపిన కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఇంతకుముందే వన్డే, టీ20 కెప్టెన్సీ తప్పుకున్న కోహ్లీ… ఇంత హఠాత్తుగా టెస్టుల నుంచి కూడా సారధ్య బాధ్యతలు వదులుకుంటాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఎవరు అన్న ప్రశ్న మొదలైంది.

రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్ల కమాండ్‌ని తీసుకున్నాడు. టెస్టు జట్టుకు కూడా రోహితే కెప్టెన్ అవుతాడా? లేకపోతే రాహుల్‌కు ఛాన్స్‌ ఇస్తారా..? లేకపోతే యంగ్‌స్టర్‌ రిషబ్‌ పంత్‌కు అవకాశమిస్తారా..? అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇక పంత్ యువకుడు కావడంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అతనికే కెప్టెన్సీ అప్పగించాలని సునీల్‌ గవాస్కర్‌ లాంటి మాజీలు కోరుతున్నారు.

TSRTC : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

అటు జస్ప్రిత్​బుమ్రాకు కూడా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకి బీసీసీఐ మదిలో ఏం ఉంది..? బీసీసీఐ ఎవర్ని ఫైనల్‌ చేస్తుంది..? కౌన్‌ బనేగా కెప్టెన్‌పైనే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్‌హాట్‌ చర్చ సాగుతోంది.