Sukhvinder Sukhu: చిన్నతనంలో పాలమ్మిన డ్రవైర్ కొడుకు నుంచి నేడు ముఖ్యమంత్రి వరకు.. హిమాచల్ నూతన సీఎం ప్రస్థానం

రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‭గా ఉన్న సుఖు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా శనవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైనప్పుడే హైకమాండ్ విశ్వాసం ఆయనకు మెండుగా ఉందని స్పష్టమైంది.

Sukhvinder Sukhu: చిన్నతనంలో పాలమ్మిన డ్రవైర్ కొడుకు నుంచి నేడు ముఖ్యమంత్రి వరకు.. హిమాచల్ నూతన సీఎం ప్రస్థానం

New Chief Minister Sukhvinder Sukhu, A Driver's Son Who Once Sold Milk

Sukhvinder Sukhu: హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్‭‭ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డ్రైవర్ కుమారుడిగా ఒకప్పుడు పాలు అమ్మిన ఆయన నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆద్యంతం సవాళ్లమయం. అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎం కుర్చీ వరకు వచ్చారు. కాగా, ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

వీరభద్ర సింగ్ లేకుండా మొదటి సారి ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి.. ఇది తొలి విజయం. పైగా ఎన్నికల బాధ్యతల్ని పూర్తిగా భుజాల మీద వేసుకుని నడిపించిన సుఖు.. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పార్టీలో ఆయన ఔన్నత్యం మరింత పెరిగింది. వీరభద్ర సింగ్ లేని లోటును సుఖు తీర్చారని కూడా అంటున్నారు.

Asaduddin Owaisi: ఎవరు గొప్ప హిందువు? నేటి రాజకీయ యుద్ధం ఇదే.. ఓవైసీ విమర్శలు

ఆర్టీసీ డ్రైవర్ కుమారుడు అయిన సుఖుది నిరాడంబరమైన జీవితం. తన చిన్నతనంలోనే ఛోటా సిమ్లాలో మిల్క్ కౌంటర్‌ను నడిపేవారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎక్కడా ఆగకుండా అంచెలంచెలుగా ఎదిగారు. ఆరుసార్లు ముఖ్యమంత్రి అయిన వీరభద్ర సింగ్‌తో తరచుగా సుఖుకు విభేదాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో వీరభద్ర సింగ్‭కు చాలా ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆయనతో విభేదిస్తూనే 2013 నుంచి 2019 వరకు రికార్డు స్థాయిలో ఆరేళ్లపాటు పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా కొనసాగారు.

ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత పాత పోటీ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి వీరభద్ర సింగ్ కాకుండా ఆయన భార్య ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. 1966లో హిమాచల్‌లో విలీనమైన నలాఘర్, ఉనా, హమీర్‌పూర్, కాంగ్రా, దిగువ కొండలు కులు వంటి ప్రాంతాలతో కూడిన ప్రాంతం నుంచి వచ్చిన మొదటి కాంగ్రెస్ నాయకుడు సుఖు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత హమీర్‌పూర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి.

S Jaishankar: పాక్-ఇండియాల మధ్య క్రికెట్ సంబంధాలు మారుతున్నాయా?.. మంత్రి జయశంకర్ ఏమన్నారంటే?

రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‭గా ఉన్న సుఖు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా శనవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైనప్పుడే హైకమాండ్ విశ్వాసం ఆయనకు మెండుగా ఉందని స్పష్టమైంది. ఆయన మద్దతుదారులకు పెద్ద సంఖ్యలో పార్టీ టిక్కెట్లు లభించాయని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

ఆయన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సమయంలో పార్టీని బలోపేతం చేశారు. కార్యకర్తలు, శాసనసభ్యులతో ఆయనకున్న సాన్నిహిత్యం ఆయనను ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా మార్చిందని అంటున్నారు. 2003లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాదౌన్ నుంచి గెలుపొందారు. 2007లో తన సీటును నిలబెట్టుకున్నప్పటికీ 2012లో ఓడిపోయి 2017, 2022లో వరుసగా గెలుపొందారు. మొదట ఆయన కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అనంతరం తరువాత అధ్యక్షుడయ్యారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అతను రెండుసార్లు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

MCD: బీజేపీ నేతలపై ఆప్ హార్స్ ట్రేడింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కమల పార్టీ