Rajashtan Politics: రాజస్థాన్‌కు కొత్త సీఎం? సచిన్ పైలట్‌కు షాకిచ్చేందుకు సిద్ధమైన గెహ్లాట్.. సీఎం అభ్యర్థిగా తెరపైకి మరోపేరు..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేసే ముందు రాజస్థాన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గే, ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ కూడా ఈ సమావేశంకు హాజరు కానున్నారు.

Rajashtan Politics: రాజస్థాన్‌కు కొత్త సీఎం? సచిన్ పైలట్‌కు షాకిచ్చేందుకు సిద్ధమైన గెహ్లాట్.. సీఎం అభ్యర్థిగా తెరపైకి మరోపేరు..

Rajastan cm

Rajashtan Politics: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేసే ముందు రాజస్థాన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గే, ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ కూడా ఈ సమావేశంకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానంకు జరిగే ఎన్నికలో గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గెహ్లాట్ వైపే గాంధీ కుటుంబం మొగ్గుచూపుతుంది. ఈ క్రమంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు అన్న చర్చ ఇప్పటికే కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు గెహ్లాట్ చేపడితే రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Heart Disease : గుండె జబ్బులకు ఇలాంటి ఆహారాలే ప్రధాన కారణమా?

నేడు జరిగే పార్టీ శాసన‌సభ పక్షం సమావేశంలో గెహ్లాట్ రాజీనామా అంశంకు తోడు రాజస్థాన్ కొత్త సీఎం ఎవరు అనే అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. సచిన్ పైలెట్ కు సీఎం పగ్గాలు అప్పగించేందుకు సోనియా, రాహల్ వంటి నేతలు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తపేరు తెరపైకి వచ్చింది. అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి పదవికి సచిన్ పైలట్ ప్రధాన పోటీదారు. శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని పైలట్ కలిశారు. ఆసక్తికరంగా జోషి పేరు కూడా ప్రచారంలో ఉంది. జోషి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు.

గతంలో గెహ్లాట్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా, మంత్రిగా కొనసాగవచ్చని చెప్పారు, ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి, ఒక పదవి మాత్రమే కలిగి ఉండాలని స్పష్టం చేశాడు. దీంతో గెహ్లాట్ ఆశలకు గండికొట్టినట్లయింది. ఈ విషయంపై రాజస్థాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ.. సంవత్సరంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున, హైకమాండ్ గెహ్లాట్‌కు రెండు పదవులు (కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి) ఇస్తే అది మాకు మరింత ఆనందదాయకంగా ఉంటుందని అన్నారు.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పును కోరుకోవడం లేదని పలువురు మంత్రులతో పాటు తాను కూడా కోరుకోవడం లేదని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. రాజస్థాన్‌లో నాయకత్వ మార్పు అక్కర్లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుస్తాం.. మా అభిప్రాయాలను తెలియజేస్తామని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు సాయంత్రం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది.