New Congress President: ఎన్నో సవాళ్లు ఉన్నాయి.. ఖర్గేకు మా సహాయ సహకారాలు ఉంటాయి: సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. సవాళ్లను ఖర్గే సమర్థంగా ఎదుర్కొని పార్టీని నడిపిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడారు.

New Congress President: ఎన్నో సవాళ్లు ఉన్నాయి.. ఖర్గేకు మా సహాయ సహకారాలు ఉంటాయి: సోనియా గాంధీ

New Congress President: కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. సవాళ్లను ఖర్గే సమర్థంగా ఎదుర్కొని పార్టీని నడిపిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడని చెప్పారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు.

తమ పార్టీ ఇంతకు ముందు కూడా సీనియర్ నేత ఖర్గే నాయకత్వంలో ముందుకు వెళ్లామని తెలిపారు. కాగా, ఖర్గేకు కాంగ్రెస్‌ ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఎన్నిక సర్టిఫికెట్ ను ఇచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఇతర ఏఐసీసీ పదాధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..