కరోనా వచ్చిన వారాల తర్వాత… జుట్టు ఊడిపోతుంది. ఇది కొత్త రోగ లక్షణం

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 08:22 AM IST
కరోనా వచ్చిన వారాల తర్వాత… జుట్టు ఊడిపోతుంది. ఇది కొత్త రోగ లక్షణం

కరోనా రూపం మార్చుకొంటోంది. కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా కావొచ్చని అంచనాకు వచ్చే వారు. తాజాగా జుట్టు కూడా ఇందులో చేరింది.

కరోనా వైరస్ గత ఆరు నెలలుగా విస్తరిస్తూనే ప్రజల ప్రాణాలు తీస్తోంది. కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తుండడంతో దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వైరస్ ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండదని, విస్తరిస్తున్న క్రమంలో రూపం మార్చుకొంటోందని గ్రహించినట్లు, ప్రజలు అనారోగ్యానికి గురయిన తర్వాత..కొన్ని వారాల తర్వాత..జుట్టు రాలడం కనిపిస్తుందంటున్నారు.

తాను స్నానం చేసే సమయంలో వెంట్రకలు బయటకు రావడాన్ని గమనించినట్లు, చౌకగా ఉన్న షాంపును తాను ఉపయోగించడం జరిగిందని ఓ మహిళ తెలిపింది. మార్చి నెలలో కరోనా వైరస్ ఈమెకు సోకింది. ఈమెకు వైద్య చికిత్స అందిస్తున్న వారిలో నర్సు జూలీ ఫిషర్ ఒకరు. ఈ విషయాన్ని ఈమె WebMDకి తెలిపింది.

కోవిడ్ రోగులకు జుట్టు రాలిపోవడాన్ని గ్రహించానని, వైరస్ సోకిందనడానికి ఇదొక కారణమని గ్రహించినట్లు గుర్తు చేసుకుంది. వంద రోజులకు పైగా కరోనా వైరస్ లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు, అందులో జట్టు రాలడం కూడా ఒకటన్నారు.

జుట్టు రాలడం అనేది తీవ్రమైన అనారోగ్యం లేదా ఒత్తిడి వల్ల అయి ఉంటుందని UCLA లోని David Geffen School of Medicine లో Sara Hogan, MD, a health sciences clinical instructor WebMDకి తెలిపారు. జట్టు రాలడంలో దశలున్నాయని 10 శాతం వరకు రాలిపోతుంటాయని, ఒత్తిడి లేదా షాక్ తిన్న సమయంలో 50 శాతం వరకు రాలిపోయే అవకాశాలున్నాయని Hogan తెలిపారు.
ఒత్తిడి, అధిక జ్వరం, అనారోగ్యం, బరువు తగ్గడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలున్నాయని WebMD వెల్లడించింది.