Covid 19 Variant : ఒక్కరి నుంచి ఒకేసారి ముగ్గురికి కరోనా వ్యాప్తి.. సెకండ్ వేవ్ వేరియంట్ వెరీ డేంజరస్

కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మన దేశంపై సునామీలా విరుచుకుపడుతోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కాగా సెకండ్ వేవ్ వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సెకండ్ వేవ్ వైరస్ చాలా డేంజరస్ అని తేలింది.

Covid 19 Variant : ఒక్కరి నుంచి ఒకేసారి ముగ్గురికి కరోనా వ్యాప్తి.. సెకండ్ వేవ్ వేరియంట్ వెరీ డేంజరస్

New Covid 19 Variant Highly Infectious

New Covid-19 Variant Highly Infectious : కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మన దేశంపై సునామీలా విరుచుకుపడుతోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కాగా సెకండ్ వేవ్ వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సెకండ్ వేవ్ వైరస్ చాలా డేంజరస్ అని తేలింది.

సెకండ్ వేవ్ వైరస్‌ ఫస్ట్ వేవ్ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తుందని ఆ పరిశోధన గణాంకాలు చెబుతున్నాయి. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన పరిశోధన గణాంకాలు ఈ విషయాలను తెలుపుతున్నాయి. ‘ఈ సెకండ్ వేవ్ లో అనేక మంది వైరస్‌ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనం’ అని టీఐఎఫ్ఆర్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సందీప్‌ జునేజా వెల్లడించారు.

ముంబైలో కరోనా మరణాలు అధికంగా నమోదవడానికి కారణాలను పరిశోధిస్తున్నామని సర్వే తెలిపింది. మహారాష్ట్రలో రెండో దశ వైరస్‌ ఫిబ్రవరి నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించడంతో అది విజృంభించిందని తెలిపింది. మే మొదటి వారంలో ముంబైలో మరణాలు అధికంగా ఉంటాయని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగితే జూన్‌ 1 నాటికి మరణాల సంఖ్య తగ్గుతుందని సర్వే తెలిపింది.

దేశంలో సోమవారం ఒక్కరోజే 3,57,229 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 2,22,408 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 48,621 మందికి వైరస్‌ సోకగా, 567 మంది చనిపోయారు.