Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్

కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ BA 2.75 ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్ నిపుణుల ప్రకారం.. దాదాపు 10 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్ హెల్త్ మినిష్ట్రీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్

Omicron Ba.5

Omicron Sub-Variant: కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ BA 2.75 ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్ నిపుణుల ప్రకారం.. దాదాపు 10 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్ హెల్త్ మినిష్ట్రీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

తెల్ హషోమెర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లో ఉన్న సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకు సంబంధించి డా. షే ఫ్లీషన్ వరుస ట్వీట్ల అనంతరం ఇలా వెల్లడించారు. జెనోమిక్ డేటా ప్రకారం.. ఎనిమిది దేశాల్లో నమోదైన 85 సీక్వెన్సెస్ ల ఫలితంగా నెక్స్ట్‌స్ట్రైయిన్ రానుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇండియాలో 69కేసులు నమోదు కాగా, వాటి వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ (1), హర్యానా (6), హిమాచల్ ప్రదేశ్ (3), జమ్మూ (1), కర్ణాటక (10), మధ్య ప్రదేశ్ (5), మహారాష్ట్ర (27), తెలంగాణ (2), ఉత్తర ప్రదేశ్ (1), పశ్చిమ బెంగాల్ (13). ఇప్పుడు ఇండియానే కాకుండా జపాన్ (1), జర్మనీ (2), యూకే (6), కెనడా (2), యూఎస్ (2), ఆస్ట్రేలియా (1), న్యూజిలాండ్ (2) అని నెక్స్‌ట్రైన్ డేటా వెల్లడించింది.

Read Also: మహారాష్ట్రలో తొలిసారి ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 కేసులు

ఇండియా వెలుపల నమోదైన సీక్వెన్సెస్ ఫలితంగా ఇంకా ఎటువంటి వ్యాప్తి జరగలేదని ఫ్లీషన్ పేర్కొన్నారు.

BA.2.75 తర్వాతి డామినెంట్ వేరియంట్ అవుతుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేమని అన్నారు. ఉప-వేరియంట్ “ఆందోళన కలిగించొచ్చు.. ఎందుకంటే ఇది రాబోయే వేరియంట్ గురించి సూచిస్తుందని పేర్కొన్నాడు. ఇటీవలి నెలల్లో, Omicron సబ్ వేరియంట్ ఆధారంగా BA.1, BA.2, BA.3, BA.4, BA.5లు పుట్టుకొచ్చాయని ఫ్లీషాన్ వివరించారు.