అనేక ప్రత్యేకతలతో…చలామణిలోకి కొత్త రూపాయి నోట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : February 10, 2020 / 12:23 PM IST
అనేక ప్రత్యేకతలతో…చలామణిలోకి కొత్త రూపాయి నోట్లు

కొత్త 1రూపాయి నోట్లు తర్వలో చలామణిలోకి రానున్నాయి. అయితే మిగిలిన కరెన్సీ నోట్లలా కాకుండా ఈ కొత్త 1 రూపాయి నోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖనే ముద్రిస్తుందట. సాధారణంగా అన్ని కరెన్సీ నోట్లను ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుందన్న విషయం తెలిసిందే. అధికారిక గెజిట్ లో తెలిపిన ప్రకారం….ఫిబ్రవరి-7,2020నుంచి కొత్త 1రూపాయి నోట్లు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. 

త్వరలో మీ చేతుల్లోకి రానున్న కొత్త రూపాయి నోట్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుదాం

1. కొత్త రూపాయి నోట్లపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్షరాల పైన భారత్ సర్కార్ అనే పదాలతో ఈ కొత్త నోట్లు రానున్నాయి
2. కొత్త రూపాయి నోట్లు అటను చక్రవర్తి,సెక్రటరీ,ఆర్థికమంత్రిత్వశాఖ అనే  రెండు సంతకాలతో ఉంటుంది.
3. కొత్త రూపాయి నోట్లు…2020 యొక్క ‘₹’ చిహ్నంతో ‘సత్యమేవ్ జయతే’ తో జారీ చేయబడిన కొత్త రూపాయి నాణెం యొక్క ప్రతిరూపాన్ని మరియు నంబరింగ్ ప్యానెల్‌లో క్యాపిటల్ ఇన్సెట్ లెటర్ ‘L’ ను కలిగి ఉంటుంది.

4. ఎడమ నుండి కుడికి సంఖ్యల ఆరోహణ పరిమాణంలో నోట్ యొక్క కుడి చేతి దిగువ భాగంలో నంబరింగ్ నలుపు రంగులో ఉంటుంది.
5. నోటు వెనుక భాగంలో 2020తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన భారత్ సర్కార్ అనే అక్షరాలు ఉంటాయి. రూయియి కాయిన్’ ₹’ సింబల్ ఉంటుంది.
8. ఈ రూపాయి నోట్లు పింక్ గ్రీన్ కలర్ లో ఉంటాయి.
9. 9.7*6.3సెంటీమీటర్ల సైజుతో రెక్టాంగులర్ సైజులో ఇవి ఉంటాయి.