Loan Apps Scam : చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం

చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలని ముఠా చైనాకు తరలించింది. తాజాగా లోన్ యాప్స్ పేరుతో రూ.5 వేల కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది.

Loan Apps Scam : చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం

Lone Apps

China loan apps scam : చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలని ముఠా చైనాకు తరలించింది. తాజాగా లోన్ యాప్స్ పేరుతో 5 వేల కోట్ల రూపాయలను చైనాకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. కొత్త పద్ధతిలో ముఠా చైనాకి డబ్బులు తరలించింది. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టిoచింది.

విమానాల ద్వారా పెద్దమొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ పత్రాలను పరిశీలించిన ఈడీకి దిమ్మతిరిగే అంశాలు తెలిశాయి. ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకపోయనా డబ్బులు మళ్లించారు. వస్తువులు దిగుమతి చేసుకుని డబ్బులు పంపించినట్టుగా ముఠా క్రియేట్ చేసింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు లోన్ యాప్స్ ప్రతినిధులపై మరో కేసు నమోదు చేశారు.

Dangerous Android Apps : ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌తో జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పాస్‌వర్డ్ దోచేస్తారు..!

పత్రాల పరిశీలనలో కొత్త కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. 450 కోట్ల రూపాయలకు సంబంధించిన వస్తువులను దిగుమతి చేసినట్లుగా నకిలీ ఆధారాలు సృష్టించారు. విమానాల ద్వారా వస్తువులను దిగుమతి చేసుకున్నట్లుగా నకిలీ వే బిల్స్ తయారు చేశారు.

వే బిల్స్ పరిశీలించిన ఈడీ ఆ బిల్స్ నకిలీవని తేల్చింది. తప్పుడు వే బిల్స్ పెట్టి 450 కోట్ల రూపాయల నిధులను చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ పిర్యాదుతో సిసిఎస్ పోలీసులు లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు.