Air India : ఎయిరిండియా సిబ్బందికి కొత్త రూల్స్‌

విధులకు హాజరయ్యే సిబ్బంది యూనిఫామ్‌ ధరించడంతో పాటు పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించి రావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

Air India : ఎయిరిండియా సిబ్బందికి కొత్త రూల్స్‌

Air India (1)

Air India staff‌ : ఎయిరిండియాలో సమయపాలనను మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్‌ చర్యలు మొదలుపెట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా విమాన సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించాలని, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత షాపింగ్‌లు వంటివి చేయొద్దని పేర్కొంది. ఈ మేరకు ఎయిరిండియా సర్క్యులర్‌ జారీ చేసింది.

విధులకు హాజరయ్యే సిబ్బంది యూనిఫామ్‌ ధరించడంతో పాటు పరిమిత సంఖ్యలో ఆభరణాలు ధరించి రావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కస్టమ్స్‌, సెక్యూరిటీ చెక్‌ల వద్ద జాప్యాన్ని నిరోధించడానికి దీన్ని ప్రతి ఒక్కరూ నిభందనలు పాటించాలని తెలిపారు. సిబ్బంది నిర్దేశించిన సమయంలోగా భద్రతా తనిఖీలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

NCB Inquiry : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం.. పెద్ద కేసుల్లో మాత్రమే ఎన్సీబీ విచారణ

ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత వారి ఎదుట సిబ్బంది ఆహార పదార్థాల తినడం, డ్రింక్స్ తాగడం చేయకూడదని తెలిపారు. యూనిఫాం ధరించి చక్కటి గుడ్‌ లుక్‌తో ఉన్నప్పుడే ప్రయాణికుల్లో సిబ్బంది పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

టాటా గ్రూప్ తీసుకున్నాక BMI నిబంధనలను ఇప్పటికే సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజా సర్క్యులర్‌లో పెద్దగా ఇబ్బందికర నిబంధనలు లేవని ఎయిరిండియా యూనియన్ నేతలు చెప్తున్నారు.