New Toll Plaza Rules: టోల్ ప్లాజా దగ్గర 10 సెకన్లకు మించి వెయిట్ చేయాల్సి వస్తే నో ట్యాక్స్

ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద పెద్ద క్యూలు కట్టాల్సి వస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది.

New Toll Plaza Rules: టోల్ ప్లాజా దగ్గర 10 సెకన్లకు మించి వెయిట్ చేయాల్సి వస్తే నో ట్యాక్స్

New Project (3)

New toll plaza rules: ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద పెద్ద క్యూలు కట్టాల్సి వస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. 10సెకన్లు దాటి టోల్ ప్లాజాల వద్ద వెయిట్ చేసిన వాహనాలకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

100మీటర్ల కంటే ఎక్కువ క్యూ లైను ఉండకుండా చూసుకోవాలని కొత్త గైడ్ లైన్స్ చెప్తున్నాయి. దీని కోసం ప్రతి టోల్ బూత్ దగ్గర 100మీటర్ల ముందే ఎల్లో లైన్ ఒకటి ఏర్పాటు చేయాలని టోల్ ప్లాజా ఆపరేటర్లను ఆదేశించారు.

టోల్ ప్లాజా కొత్త రూల్స్:
1. పీక్ అవర్స్ లో నేషనల్ హైవేస్ మీద 10సెకన్లకు మించిన వెయిటింగ్ టైం ఉండకూడదు.
2. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఫ్లో 100మీటర్లకు మించి ఉండకూడదు.
3. 100 మీటర్లు దాటిన తర్వాత కూడా వెహికల్ వెయిట్ చేయాల్సి వస్తే ఆ వాహనం టోల్ చెల్లించకుండానే పాస్ చేయించాలి.
4. ప్రతి టోల్ లైనుకు ముందు 100మీటర్ల వరకూ మార్క్ చేసి పసుపు రంగు గీతను గీయాల్సి ఉంటుంది.

మినిస్ట్రీ లెక్కల ప్రకారం.. టోల్ ప్లాజాల్లో ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత వెయిటింగ్ టైం తగ్గిందట. 100శాతం ఫాస్టాగ్ ఉండాల్సిందేనని చెప్పిన తర్వాత దాదాపు టోల్ ప్లాజాలన్నింటిలో ట్రాఫిక్ లేకుండాపోయింది.

సోషల్ డిస్టెన్సింగ్ లాంటి కొత్త నార్మ్స్ ప్రకారం.. ఫాస్టాగ్ వచ్చాక టోల్ పేమెంట్ ఆప్షన్ తీసేసి హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా ఫాస్టాగ్ సర్వీసునే ఇష్టపడుతున్నారు టోల్ ఆపరేటర్లు, డ్రైవర్లు.