Lucknow Cab Driver : బయటపడ్డ నిజం.. క్యాబ్‌ డ్రైవర్‌‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి ఘటనలో ట్విస్ట్‌

యూపీ రాజధాని లక్నోలో నడిరోడ్డుపై కారులోంచి లాగి క్యాబ్ డ్రైవర్ ను ఓ యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా, ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

Lucknow Cab Driver : బయటపడ్డ నిజం.. క్యాబ్‌ డ్రైవర్‌‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి ఘటనలో ట్విస్ట్‌

Luncknow Cab Driver

Luncknow Cab Driver : యూపీ రాజధాని లక్నోలో నడిరోడ్డుపై కారులోంచి లాగి క్యాబ్ డ్రైవర్ ను ఓ యువతి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా, ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. క్యాబ్‌ తనను ఢీకొట్టబోయిందనే కారణంతో తాను ఇలా చేశానని యువతి చెప్పింది. ఇది నిజం అని అంతా నమ్మారు. కట్ చేస్తే, అసలు నిజం బయటపడింది. తప్పు క్యాబ్ డ్రైవర్ ది కాదని, యువతిది అని తేలింది.

వీడియో, సీసీటీవీ ఫుటేజీ చూశాకే అసలు వాస్తవం వెలుగుచూసింది. ఆ యువతే ప్రమాదకర రీతిలో రోడ్డును దాటుతూ కనిపించింది. ఇంత హల్‌చల్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్‌ను చెంప దెబ్బలు కొట్టిన యువతిదే చివరికి తప్పని తేలింది. దీంతో సోషల్ మీడియాలో ‘అరెస్ట్ లక్నో గర్ల్’ అంటూ పెద్దఎత్తున నెటిజన్లు పోస్టులు చేశారు.

ఒత్తిడి పెరగడంతో ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె అందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చింది. పోలీసులు తన కుటుంబ సభ్యులను వేధించారని ఆరోపించింది. పోలీసుల దగ్గర తన కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లు, వివరాలు ఉన్నాయంది. తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవి అడ్డంగా వాదించింది. క్యాబ్ డ్రైవర్ ని ఊరికే కొట్టలేదని, ఆత్మరక్షణ కోసం మాత్రమే చేయి చేసుకున్నా అని తప్పును సమర్థించుకుంది.

అసలేం జరిగిందంటే..
లక్నోలో వాహనాలు రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రియదర్శిని అనే యువతి రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో సాదత్ అలీ సిద్ధిఖీ అనే వ్యక్తి క్యాబ్‌ నడుపుకుంటూ తనకు అతి సమీపంగా వచ్చాడు. అంతే.. కారు తనను ఢీకొట్టబోయిందని అతనిని క్యాబ్‌ నుంచి లాగి మరీ అతనిపై చేయి చేసుకుంది. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా తన చేతివాటం ప్రదర్శించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి అశాంతికి భంగం కలిగించారంటూ క్యాబ్‌ డ్రైవర్‌ సిద్ధిఖీపై కేసు నమోదు చేశారు.

‘క్యాబ్ డ్రైవర్ కారును జీబ్రా క్రాసింగ్ మీదకు పోనిచ్చాడు. ఇది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడం కాదా? సీసీటీవీ ఫుటేజీని పరిశీలించండి. తప్పెవరిదో తేల్చండి. ఒకవేళ నేను చనిపోయి ఉంటే.. పోస్టుమార్టం చేసి నా డెడ్‌బాడీని ఇంటికి పంపించేవారా..?’ అని యువతి వాపోయింది.

నాకు న్యాయం కావాలి-క్యాబ్ డ్రైవర్
కాగా క్యాబ్ డ్రైవర్ మరోలా చెప్పాడు. ఆ యువతి కారులోంచి నా ఫోన్‌ను లాగేసుకుంది. దాన్ని పగలగొట్టింది. కారు సైడ్ అద్దాలను పగలగొట్టింది. నా జేబులోంచి రూ.600 లాక్కుంది. నేను ఎలాంటి ట్రాఫిక్‌ నియామాలను ఉల్లంఘించలేదు. అయినా పోలీసులు నాపై కేసు నమోదు చేశారు. నాకు 24 గంటలపాటు ఆహారం పెట్టలేదు. ఆ మహిళ చెప్పిందే విన్నారు, కానీ నా మాట ఎవరూ వినిపించుకోలేదు. నేనో పేద కుటుంబానికి చెందిన క్యాబ్ డ్రైవర్‌ను. నాకు న్యాయం కావాలి’ అని వాపోయాడు. అంతేకాదు అకారణంగా తనపై చేయి చేసుకున్న యువతిని అరెస్ట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు.