బ్రహ్మోస్​ సూపర్​ సోనిక్​ ​ మిసైల్ పరీక్ష విజయవంతం

10TV Telugu News

BrahMos Supersonic Missile 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అత్యంత శక్తిమంతమైన సూపర్​ సోనిక్​ బ్రహ్మోస్ ​ క్రూయిజ్​ ​ మిసైల్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. . జే -10 ప్రాజెక్ట్ కింద భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.


ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ బేస్ వద్ద సెప్టెంబర్ 30న ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. క్షిపణి ప్రయోగం విజయవంతం పట్ల సైంటిస్టులకు , DRDO చైర్మన్ జి. సతీష్ రెడ్డి అబినందనలు తెలిపారు.

ఇది.. బ్రహ్మోస్ పరిధిని విస్తరించిన తర్వాత చేపట్టిన రెండో పరీక్ష. క్షిపణిలో ఉపయోగించిన బూస్టర్, ఎయిర్​ఫ్రేమ్​ను దేశీయంగా తయారు చేశారు. ఈమిసైల్ ని జాయింట్ వెంచర్ లో భాగంగా డీఆర్‌డీఓ, ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్ప్రైజ్ NPO మషినోస్ట్రోయేనియా అఫ్ రష్యా డెవలప్ చేశాయి.


బ్రహ్మోస్‌ను భూమి మీద నుంచి, సముద్రతలంపై నుంచి ప్రయోగించవచ్చు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బ్రహ్మోస్ మిసైల్, డీఆర్​డీఓ బృందానికి అభినందనలు తెలిపారు.