Corona Cases : దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు, 666 మరణాలు

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 666 మంది మరణించారు.

Corona Cases : దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు, 666 మరణాలు

Corona

corona positive cases in india : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 666 మంది మరణించారు. ఈమేరకు శనివారం(అక్టోబర్ 23, 2021) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేరళలో 563 మరణాలను కోవిడ్ మరణాలుగా గుర్తించడంతో మరణాల సంఖ్య పెరిగింది.

దేశంలో ఇప్పటివరకు 3,41,59,562 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మొత్తం 4,53,708 మృతి చెందారు. దేశంలో కరోన రికవరీ రేటు 98.16 శాతంగా ఉంది. 233 రోజుల కనిష్టానికి యక్టీవ్ కేసులు చేరాయి. ప్రస్తుతం దేశంలో 1,73,728 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.51 శాతంగా ఉన్నాయి.

Covid-19: మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ప్రభుత్వాలు అప్రమత్తం!

నిన్న కరోనా నుంచి 17,677 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు 3,35,32,126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మార్చి 2020 తరువాత భారీగా రికవరీ కేసుల శాతం పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోగా.. బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌, రుమేనియా దేశాల్లో కొవిడ్‌ తీవ్రత కలవరపెడుతోంది. చైనాలోనూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. బ్రిటన్‌లో కూడా 50వేల కేసులు కొత్తగా రావడంతో.. ఆ దేశంలో ఆంక్షల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

100 Crore Covid Doses : భారత్ 100 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత

ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందకపోవడమే ఇందుకు కారణమని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో రష్యాలో కొత్తగా 37వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కారణంగా మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు రష్యా అభిప్రాయపడుతోంది. అయితే, వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.