Cream Fungus: ఉన్నవి చాలవని కొత్తగా వచ్చిపడిన క్రీమ్ ఫంగస్!

ఒకపక్క కరోనా వైరస్‌ సమాజానికి పట్టిన శనిలా పట్టుకొని పీడిస్తుంటే మనుషులు అల్లాడిపోతున్నారు. కరోనాకు తోడు ఫంగస్ ల బెడద మరీ ఎక్కువవుతుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ (Black Fungus) మరింత భయాందోళనలు

Cream Fungus: ఉన్నవి చాలవని కొత్తగా వచ్చిపడిన క్రీమ్ ఫంగస్!

Newly Arrived Cream Fungus In India

Cream Fungus: ఒకపక్క కరోనా వైరస్‌ సమాజానికి పట్టిన శనిలా పట్టుకొని పీడిస్తుంటే మనుషులు అల్లాడిపోతున్నారు. కరోనాకు తోడు ఫంగస్ ల బెడద మరీ ఎక్కువవుతుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ (Black Fungus) మరింత భయాందోళనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు ‘వైట్ ఫంగస్’ (White fungus), ఎల్లో ఫంగస్ (Yellow Fungus) కూడా ఇప్పటికే మన దేశంలో కనిపించింది. ఇప్పుడు ఇవి చాలవని కొత్తగా క్రీమ్ ఫంగస్ (Cream Fungus) అని మరొకటి తయారైంది. క్రీమ్ ఫంగస్ (Cream Fungus) అనే మరో ఇన్ఫెక్షన్‌ను వైరస్ బాధితుల్లో కనిపెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ క్రీమ్ ఫంగస్ (Cream Fungus)కు సంబంధించిన ఓ కేసును గుర్తించామని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వైద్య కళాశాల ఈఎన్‌టీ విభాగం వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓ రోగికి ఈ క్రీ మ్‌ ఫంగస్ (Cream Fungus) సోకినట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ రోగికి ముందు బ్లాక్ ఫంగస్ (Black Fungus) సోకగా వెనుక ఈ క్రీమ్ ఫంగస్ (Cream Fungus) కూడా సోకినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు.

కాగా.. ఇప్పటికే దేశంలో బ్లాక్ ఫంగస్ (Black Fungus) కేసులు అంతకంతకు పెరుగుతుండగా మందుల కొరత మరోవైపు వేధిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా రకరకాల ఫంగస్ లు ఏర్పడుతూ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా రోగులకు మితిమీరిన స్థాయిలో అందిస్తున్న యాంటీ బయోటిక్‌ మందులతో జీర్ణాశయంలోని కీలకమైన గట్‌ బ్యాక్టీరియా (Gut Bacteria) నశించడం వలనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లలైనా ఎదుర్కోవడంలో గట్‌ బ్యాక్టీరియా (Gut Bacteria) ముఖ్య పాత్ర పోషించేది కాగా మందులతో అది నశిస్తుందని నిపుణులు అబ్బీప్రాయపడుతున్నారు.