పెళ్లి అలంకరణతో ఓటు వేసిన నవ దంపతులు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 10:33 AM IST
పెళ్లి అలంకరణతో ఓటు వేసిన నవ దంపతులు

జమ్మూకశ్మీర్‌లో ఓ కొత్త జంట పెళ్లి అలంకరణతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పెళ్లి తతంగం అంతా పూర్తయిన వెంటనే పీటల మీద నుండి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు సంవత్సరాలకు వచ్చే తమ బాధ్యతను విస్మరించకుడదే మంచి ఉద్ధేశ్యంతో ఉదంపూర్‌కు చెందిన ఈ కొత్త జంట పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ.. ‘వివాహ వేడుక కనీసం రెండు మూడు రోజుల పాటు జరుగుతుందనీ..కానీ 10 నిమిషాలు కేటాయించి మనం వేసిన ఓటు అనేది మన అందరి హక్కు అని తెలిపారు. 
Also Read : వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్

ఐదేళ్ల పాటు మనల్ని పాలించే నేతలను  ఎన్నుకుంటామనీ..అందుకే ఓటు చాలా చాలా అవసరమన్నారు. ఓటు వేయకుంటే గెలిచిన నాయకుడిని ప్రశ్నించే అవకాశం మనకు ఉండదనీ ప్రశ్నించే హక్కును కూడా పోగొట్టుకుంటామన్నాడు వరుడు. ఈ సందర్భంగా  వధువు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటింగ్ చాలా ముఖ్యమన్నారు. మనం కచ్చితంగా ఓటేసి దేశ అభివృద్ధికి భరోసా ఇవ్వాలని..కాబట్టి ఎన్ని పనులు ఉన్నా ఓటు వేయటం మాత్రం విస్మరించవద్దని ఆమె సూచించారు.