Tamil Nadu Couple : కొత్తగా పెళ్లైన జంటకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ చూసి షాక్..!
Tamil Nadu Couple : అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నింటాయి. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి.

Newly Wed Tamil Nadu Couple Gets Petrol And Diesel As Wedding Gift In Epic Gesture From Friends
Tamil Nadu Couple : అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నింటాయి. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశంలో కేవలం 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలపై సోషల్ మీడియాలో మిమీలు, జోకులతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు, పెట్రోల్, డీజిల్ బంగారం కంటే ఖరీదైన వస్తువుగా మారాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన ఓ పెళ్లివేడుకలో కొత్తగా పెళ్లైన జంటకు పెట్రోల్, డీజిల్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చి స్నేహితులు సర్ ప్రైజ్ చేశారు.
ఒకవైపు పెట్రో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో స్నేహితులు ఇచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ బాటిళ్ల బహుమతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంట వివాహ వేడుక జరిగింది. ఈ నూతన వధువరులతో కలిసి ఫొటో దిగేందుకు వేదికపై వచ్చిన స్నేహితులు ఒక్కసారిగా ఒక కవర్‌లో నుంచి రెండు బాటిళ్లు బయటకు తీశారు. ఆ బాటిళ్లు పెట్రోల్, డీజిల్‌తో నింపి ఉన్నాయి.
Amidst rising #PetrolDieselPriceHike, friends of the newly married couple, Girish Kumar and Keerthana decided to gift the couple One Litre #petrol and One Litre #diesel as a wedding present at their Wedding reception in Cheyyur in Chengalpattu district #FuelPriceHike pic.twitter.com/Wr3BErZUwg
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) April 7, 2022
ఆ బాటిళ్లను జంట చేతిలో పెట్టి సర్‌ప్రైజ్ చేశారు. గతంలోనూ వివాహ వేడుకలో పెళ్లైన జంటకు పెట్రోల్ డబ్బాతోపాటు ఉలిగడ్డలు, సిలిండర్ ధరలు పెరిగినప్పుడు ఇలానే బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. దేశంలో నిత్యావసర ధరలు పెరిగినప్పుడల్లా వాటి విలువ ఎంత పెరిగిపోయిందో గుర్తుచేసేందుకు చాలామంది ఇలాంటి వినూత్న ప్రయత్నాలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Read Also :Shrihan : తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన సిరి హన్మంత్.. ఇతనే నా సర్వస్వం అంటూ పోస్ట్..