పేద కడుపు నింపేందుకు : హ్యాపీ ఫ్రిడ్జ్ లు   

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 10:15 AM IST
పేద కడుపు నింపేందుకు : హ్యాపీ ఫ్రిడ్జ్ లు   

ఏ మనిషీ ఆకలితో నిద్రపోకూడదు అనే ఉద్ధేశ్యంతో ఓ సంస్థ ‘హ్యాపీ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేసింది. వృథా అవుతున్న ఆహారాన్ని అన్నార్తులకు అందజేయాలనీ..ఆకలితో ఉన్నవారికి అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేశామని ఫీడింగ్ ఇండియా అనే స్వచ్ఛంధ సంస్థ ఒడిస్సాలో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. 

ఇళ్లలోను..హోటళ్లలోను వండిన ఆహార పదార్ధాలు మిగిలిపోయినవి వృధా పడేస్తుంటాం. కానీ ఆ ఆహారం ఆకలితో ఉండేవారికి అందజేయాలనీ..టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదనే ఆలోచనతో ఈ ‘హ్యాపీ ఫ్రిడ్జెస్’ఆలోచన చేశామని ఫీడింగ్ ఇండియా నగర ఇన్ చార్జ్ సింగ్ తెలిపారు. 
భిక్షగాళ్లు, పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేశామన్నారు. దయచేసి ఆహారాన్ని ఎవ్వరూ వృధాగా పడేయవద్దని మిగిలిపోయిన ఆహారాన్ని ఈ హ్యాపీ ఫ్రిడ్జ్ లలో ఉంచితే ఆకలితో ఉన్నవారికి అందజేయాలని మా సంస్థ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నామన్నామని సింగ్ తెలిపారు. లేదంటే తమ సంస్థకు తెలియజేస్తే ఆ ఆహారాన్ని సేకరించి హ్యాపీ ఫ్రిడ్జ్ లలో ఉంచుతామని అన్నారు. వృథాగా పడేసే ఆహారాన్ని దయచేసి మాకు దానం చేయండి దాన్ని ఆకలితో ఉన్నవారికి అందజేస్తామని ఫీడింగ్ ఇండియా సంస్థ  నిర్వాహకులు కోరుతున్నారు. 

ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకు సదరన్ వెస్ట్రన్ రైల్వే కర్ణాటకలోని హుబ్లి జంక్షన్ సమీపంలో ఓ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసింది. కాగా కర్ణాటకలో పబ్లిక్ ఫ్రిడ్జ్ (కమ్యూనిటీ ఫ్రిడ్జ్)పేరుతో పేదలకు ఆహారాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో కూడా ఫిబ్రవరి 14,2019న ఫీడ్ ద నీడ్ అనే పేరుతో నగరంలో పలు ప్రాంతాలలో ఫ్రిడ్జ్ లను ఏర్పాటు  చేసింది. ఈ ఫ్రిడ్జ్ ల ద్వారా ఆహారం తీసుకుని లక్ష మంది అన్నార్తులు తమ కడుపులు నింపుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి.