NGT: మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల జరిమానా

మున్సిప‌ల్ వ్యర్థాలను న‌దిలో క‌ల‌వ‌కుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.

NGT: మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల జరిమానా

Ngt

NGT slaps Rs 1 crore fine: మున్సిప‌ల్ వ్యర్థాలను న‌దిలో క‌ల‌వ‌కుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(NGT) మహారాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల జరిమానా విధించింది. 12 పవిత్రమైన ‘జ్యోతిర్లింగా’ల్లో ఒకటైన త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌లో వ్యర్ధాలు నదిలో కలుస్తున్నట్లుగా జాతీయ గ్రీన్ ట్రిబ్యున‌ల్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణలో హాజరుకావాలని ఎన్‌జీటీ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.

నాసిక్ జిల్లాలోని త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌ నది నీటి నాణ్యతను పునరుద్ధరించడానికి జిల్లా మేజిస్ట్రేట్‌కు మధ్యంతర పరిహారంగా రూ .1 కోటి డిపాజిట్ చేయాలని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. NGT ప్రిన్సిపల్ బెంచ్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్.. మున్సిపల్ వ్యర్థాలను త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌ నదిలోకి ప్రవహించకుండా నిరోధించడంలో మున్సిపల్ కౌన్సిల్ విఫలమైందని, మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోలేక‌పోయిన‌ట్లు గుర్తించారు.

గత రెండు సంవత్సరాలలో NGT నాలుగుసార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, మున్సిపల్ వ్యర్థాలను నదిలోకి విడుదల చేయకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యారని ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ గోయల్ మాట్లాడుతూ, “మహారాష్ట్ర అధికారుల వైఖరి బాధ్యతారాహిత్యం. ఇది సుప్రీంకోర్టు మరియు ట్రిబ్యునల్ బైండింగ్ లా అండ్ ఆర్డర్‌పై గౌరవం లేకపోవడానికి నిదర్శనం.

తరచుగా చట్ట ఉల్లంఘనలు, ఫలితంగా పౌరుల హక్కులకు భంగం ఏర్పడుతుంది. “పరిశుభ్రమైన వాతావరణం పౌరుల హక్కు.. అపరిశుభ్రత ప్రజారోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఇదే కార‌ణంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కోటి జ‌రిమానా విధించారు. మున్సిప‌ల్ వ్యర్థాలను న‌దిలో క‌ల‌వ‌కుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.