Pradeep Sharma: అంబానీ కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ “ప్రదీప్ శర్మ” అరెస్ట్

అంబానీ కేసుతో సంబంధం ఉన్న సంతోష్ షెలార్ అనే వ్యక్తి గతంలో ప్రదీప్ శర్మతో ఫోటో దిగారు. దీనిపై ఎన్ఐఏ అధికారులు ప్రదీప్ శర్మను ప్రశ్నించారు. షెలార్ నీతో ఎందుకు ఫోటోలు దిగడాన్ని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించగా,

Pradeep Sharma: అంబానీ కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ “ప్రదీప్ శర్మ” అరెస్ట్

Pradeep Sharma

Pradeep Sharma: ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు పెట్టిన కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మాజీ ఐపీఎస్ అధికారి ప్రదీప్ శర్మను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ముంబైలోని ప్రదీప్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది గురువారం ఉదయం దాడి చేశారు. తెల్లవారు జామున 5 గంటలకు శర్మ ఇంటికి చేరుకున్న అధికారులు సుమారు ఆరు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. అనంతరం శర్మను అధికారులు విచారించారు.

అంబానీ కేసుతో సంబంధం ఉన్న సంతోష్ షెలార్ అనే వ్యక్తి గతంలో ప్రదీప్ శర్మతో ఫోటో దిగారు. దీనిపై ఎన్ఐఏ అధికారులు ప్రదీప్ శర్మను ప్రశ్నించారు. షెలార్ నీతో ఎందుకు ఫోటోలు దిగడాన్ని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించగా, గతంలో సంతోష్ షెలార్ పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేశారని, అదే సమయంలో తన ఫోటో దిగి ఉంటాడని తెలిపారు. అంతే కాదు తనతో చాలామంది ఫోటోలు దిగుతారని వారికి తనకు సంబంధం ఉందంటే ఎలా కుదురుతుందని ఎన్ఐఏ అధికారులకు వివరించారు ప్రదీప్.

ఇదిలా ఉంటే అంబానీ ఇంటి వద్ద బాంబు పెట్టిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న సచిన్ వాజే, ప్రదీప్ శర్మ శిష్యుడని కొందరు భావిస్తున్నారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న సచిన్, సంతోష్ లతో ప్రదీప్ కు దగ్గరి సంబంధాలు ఉండటంతో అధికారులు అతడిని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే కేసు విషయమై ఏప్రిల్ నెలలో ప్రదీప్ ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. అనంతరం తిరిగి గురువారం అతడి ఇంట్లో సోదాలు చేసి.. ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ శర్మ జూన్ 21 వరకు ఎన్ఐఏ కస్టడీలోనే ఉంటారని సమాచారం.