కేరళలో ఉగ్రవాది అరెస్ట్: దక్షిణాదిలో హై అలర్ట్

  • Published By: vamsi ,Published On : April 30, 2019 / 03:50 AM IST
కేరళలో ఉగ్రవాది అరెస్ట్: దక్షిణాదిలో హై అలర్ట్

శ్రీలంకలో ఐసీస్ ఉగ్రదాడి అనంతరం దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నట్లు ఇంటిలిజన్స్ హచ్చరించిన నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో నిఘా పెంచారు అధికారులు. ఈ క్రమంలోనే క్రిస్టియన్‌లు ఎక్కువగా ఉండే కేరళలో ఉగ్రదాడులకు పన్నాగం పన్నిన రియాస్‌(29) అనే వ్యక్తిని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది.

రియాస్‌‌ను శ్రీలంకలో ఈస్టర్‌ బాంబుపేలుళ్ల సూత్రధారి జహ్రాన్‌ హషీం అనుచరుడుగా గుర్తించారు. కేరళలో ఆత్మాహుతి దాడి చేసేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో రియాస్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి వెల్లడించారు.

హషీం ఉపన్యాసాల వీడియోలను తాను ఏడాదికి పైగా చూసిన రియాస్‌.. ఆత్మాహుతి దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారుల విచారణలో అంగీకరించాడు. రియాస్‌ స్వస్థలం పాలక్కాడ్‌ ఐసీస్‌కు ప్రభావితమై కేరళలో బాంబు దాడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇదిలా ఉంటే ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో కేరళ రాష్టంతో సహా దక్షిణాది రాష్ట్రాలలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.