Terror Funding Case: జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

కేంద్ర పాలిత ప్రాంతంలోని అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్న ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) మంగళవారం జమ్మూ, కాశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో సోదాలు నిర్వహించింది.

Terror Funding Case: జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు..

NIA searches

Terror Funding Case: కేంద్ర పాలిత ప్రాంతంలోని అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్న ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) మంగళవారం జమ్మూ, కాశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో సోదాలు నిర్వహించింది. వీటిలో.. రాజౌరి, పూంచ్, జమ్మూ, శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, షోపియాన్, బండిపొరా జిల్లాలు ఉన్నాయి. జమ్మూ‌కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సమన్వయంతో ఈ సోదాలు నిర్వహించారు.

Mahakal Corridor: నేడు మహాకాల్ లోక్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అక్కడ ప్రత్యేకతలేమిటంటే..

ఇప్పటికే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ఎన్ఐఏ అధికారులు, ఇప్పుడు అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిధుల తీరు, కార్యకలాపాలపై గతంలో నమోదు చేసిన సుమోటో కేసు ఆధారంగా అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రాంతాలలో సోదాలు కొనసాగిస్తోంది. 2019లో జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్ ను యూఏపీఏ కింద చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించారు. అయితే జమాతే ఇస్లామీకి అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫ్రంటల్ ఎంటిటీ గా పనిచేస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అల్-హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రాంగణాల పై ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది.

ఎన్ఐఏకి చెందిన పలు బృందాలు ఖచ్చితైన సమాచారం ఆధారంగా ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి. ఎన్ఐఏ దాడులు నిర్వహించిన వారిలో.. ప్రముఖ మత బోధకుడు ఉలూమ్ రహీమియా, మౌలానా రెహమ్తుల్లా ఖాస్మీ, ప్రొఫెసర్ సమమ్ అహ్మద్‌లోన్ ఉన్నారని స్థానిక మీడియా కథనాలు ప్రచారం చేసింది.