NIA Attacks: ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థపై ఎన్ఐఏ ఉక్కుపాదం.. ఆరుగురు సభ్యుల అరెస్ట్

గతంలో పీఎఫ్ఐ సంస్థపై దృష్టిపెట్టి పలువురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సంస్థ నెట్‌వర్క్‌పై దాడి చేసింది. ఎనిమిది రాష్ట్రాల్లోని 76 స్థావరాలపై దాడి చేసిన ఎన్ఐఏ ఆరుగురిని అదుపులోకి తీసుకుంది.

NIA Attacks: ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థపై ఎన్ఐఏ ఉక్కుపాదం.. ఆరుగురు సభ్యుల అరెస్ట్

NIA Attacks: ఉగ్రవాద కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. గతంలో పీఎఫ్ఐ సంస్థపై దృష్టిపెట్టి పలువురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సంస్థ నెట్‌వర్క్‌పై దాడి చేసింది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

ఎనిమిది రాష్ట్రాల్లోని 76 స్థావరాలపై దాడి చేసిన ఎన్ఐఏ ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ప్రముఖ గ్యాంగ్‌స్టర్స్ అయిన లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్‌వన్‌పురియా, ఆర్ష్ దల్లా అనుచరుల్ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో లక్కీ ఖోకర్ అలియాస్ డెనిస్ కూడా ఉన్నాడు. లక్కీ.. కెనడాకు చెందిన తీవ్రవాది అర్ష్ దల్లాకు అనుబంధంగా పని చేస్తాడు. లక్కీతోపాటు హరి ఓం అలియాస్ టిటు, లఖ్విర్ సింగ్ వంటి క్రిమినల్స్ అరెస్టైన వారిలో ఉన్నారు. దల్లా అనుచరుడిగా పని చేస్తున్న లక్కీ ఖోకర్ ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని అంతర్జాతీయంగా అక్రమ రవాణా చేస్తుంటాడు.

Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

వీటిని ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థలైన ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలకు చేరవేస్తుంటాడు. పంజాబ్‌లో జరిగిన అనేక పేలుళ్లు, హత్యలకు ఆయుధాల్ని కూడా లక్కీనే సరఫరా చేసేవాడు. దల్లా ఆదేశాల ప్రకారం లక్కీ పని చేస్తాడు. లఖ్విర్ సింగ్.. చోటు రామ్ భాట్ అనే ప్రమాదకర క్రిమినల్‌కు అనుచరుడిగా పని చేస్తున్నాడు. లఖ్విర్ సింగ్ వద్ద నుంచి 9 ఆయుధాల్ని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీరితోపాటు ఇంతకుముందు దిలిప్ బిష్ణోయ్, కుషాల్ చౌధరి, అమిత్ దాగర్, సుఖ్‌ప్రీత్ సింగ్, భూపి రాణా, నీరజ్ బావాన, నవీన్ బాలి, సునీల్ బల్యాన్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీళ్లంతా దేశంలో డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే, మరికొందరు నిందితులు ఇప్పటికే దేశం విడిచిపారిపోయినట్లు విచారణలో తేలింది.